For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాస్టార్ చిరంజీవితో కామెడీ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. చాలా రోజుల తరువాత అలాంటి కామెడీతో..

  |

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులు కూడా ఎంతగానో పోటీపడుతున్నారు. ఆరు పదుల వయస్సులో కి వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం స్లో ఇవ్వడం లేదు. ఒక విధంగా నేటి తరం యువ హీరోల తరహాలోనే మంచి ఎనర్జీతో దూసుకుపోతున్నారు. గతంలో ఏడాదికి ఒక సినిమా చేసిన మెగాస్టార్ ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. ఇక రీసెంట్ గా మరో కామెడీ డైరెక్టర్ తో చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

   మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని

  మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని

  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల కారణంగా సినిమా ఇండస్ట్రీ కి కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని సినిమా విడుదల మొదటి రోజే అర్థమైంది. ఖైదీ నెంబర్ 150 అనంతరం సైరా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ తనదైన శైలిలో మెప్పించారు. ఆ సినిమా కోసం మెగాస్టార్ రెండేళ్లు కష్టపడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సినిమాల ఎంపిక విషయంలో మరింత స్పీడ్ పెంచారు.

  అదే ఎనర్జీ తో

  అదే ఎనర్జీ తో

  నేటి తరం యువ హీరోలు ఎలాగైతే రెండు మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తెస్తున్నారు మెగాస్టార్ కూడా అదే ఎనర్జీ తో యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. మొదటిసారి వస్తున్న ఈ మెగా మల్టీ స్టారర్ పై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

  ఫిట్నెస్ విషయంలో కూడా

  ఫిట్నెస్ విషయంలో కూడా

  ఆచార్య అనంతరం మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ తో పాటు మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాకు సంబంధించిన లుక్స్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఫిట్నెస్ విషయంలో కూడా మెగాస్టార్ కొంత మార్పులు చేయనున్నట్లు టాక్ వస్తోంది.

   మెగాస్టార్ నమ్మకం

  మెగాస్టార్ నమ్మకం

  అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ ఈ ప్రాజెక్టు విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అభిమానులు మాత్రం మెహర్ రమేష్ తో సినిమా అనగానే కాస్త కంగారు పడ్డారు. ఎందుకంటే గతంలో ఈ దర్శకుడు వరుసగా అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి, వెంకటేష్ తో షాడో సినిమా చేసే ఊహించని డిజాస్టర్ లను ఎదుర్కొన్నాడు. దీంతో ఏ హీరో కూడా అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు కానీ మెగాస్టార్ మాత్రం అతని పై నమ్మకం ఉంచడం సాహసమే అని చెప్పాలి.

   మారుతితో న్యూ ప్రాజెక్ట్

  మారుతితో న్యూ ప్రాజెక్ట్

  ఇక ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి మరొక సినిమాకి కూడా డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మారుతి తో మెగాస్టార్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం మెగా ఫ్యామిలీ తో మారుతికి చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. కేవలం సినిమాల పరంగానే కాకుండా గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మారుతి పార్టీలో లోగోకు సంబంధించిన డిజైన్ విషయంలో మెగాస్టార్ కు సహాయం చేశాడు.

   అలాంటి కామెడీ కథలు

  అలాంటి కామెడీ కథలు

  అప్పటి నుంచి మెగాస్టార్ మారుతికి దగ్గరగానే ఉంటున్నారు. మారుతి కూడా ఇష్టమైన అభిమాన హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగాస్టార్ కూడా అతనితో సినిమా చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాడు కానీ సరైన కథ సెట్టవ్వలేదు. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మంచి సందేశంతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ కథలు రాయమని చిరు సలహా ఇచ్చారట. శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరి వాడు తరహలో ఉండాలని కూడా అన్నారట.

   అలాంటి కామెడీ కథలు

  అలాంటి కామెడీ కథలు

  అప్పటి నుంచి మెగాస్టార్ మారుతికి దగ్గరగానే ఉంటున్నారు. మారుతి కూడా ఇష్టమైన అభిమాన హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగాస్టార్ కూడా అతనితో సినిమా చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాడు కానీ సరైన కథ సెట్టవ్వలేదు. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మంచి సందేశంతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ కథలు రాయమని చిరు సలహా ఇచ్చారట. శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరి వాడు తరహలో ఉండాలని కూడా అన్నారట.

  రెండు కథలు విన్న మెగాస్టార్

  రెండు కథలు విన్న మెగాస్టార్

  ఇక మెగాస్టార్ ఆలోచన ప్రకారం కథను సిద్ధం చేసిన మారుతీ ఇటీవల 2 కథలు వినిపించినట్లు సమాచారం మెగాస్టార్ కూడా వాటిపై పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా పనులు తుది దశలో ఉన్నాయి. పనులన్నీ పూర్తయిన తర్వాత మరోసారి చర్చిద్దామని మెగాస్టార్ మారుతికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక మరోవైపు మారుతి వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు.

  Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
  ఆ సినిమాలతో బిజీగా..

  ఆ సినిమాలతో బిజీగా..

  ఇప్పటికే గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మధ్యలో మరో గ్యాప్ రావడంతో యువ హీరో సంతోష్ శోబన్ తో 'మంచిరోజులు వచ్చాయి' అనే చిన్న సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా షూటింగ్ ను 30 రోజుల్లో నే పూర్తిచేసే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇక పక్కా కమర్షియల్ సినిమా అనంతరం మరో సినిమాను చేయనున్న మారుతి ఆ తర్వాత మెగాస్టార్ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ కూడా తన స్టైల్ లో కామెడీ సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి మారుతి మెగాస్టార్ ను ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.

  English summary
  The megastar, who previously made one film a year, has now lined up four films in a row. It seems that he is ready to negotiate with another comedy director recently. Once you go into those details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X