మరో టాలెంటెడ్ దర్శకుడితో మెగాస్టార్ చర్చలు.. కామెడీతో కేక పుట్టించే ప్లాన్!

మెగాస్టార్ చిరంజీవి తన వయసును ఏ మాత్రం లెక్క చేయకుండా యువ హీరోల కంటే స్పీడుగానే సినిమాలను పూర్తి చేస్తూ ఉండడం విశేషం. ఒక విధంగా వింటేజ్ తనలోని వింటేజ్ మెగాస్టార్ ను చూపిస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో హ్యాపీ చేస్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి సక్సెస్ అందుకొని చాలాకాలం అయింది. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి రెండు వారాలు పూర్తయినా కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకుంటూ ఉండటం విశేషం. ఇక చాలామంది దర్శకులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా టాలెంట్ ఉన్న యువ దర్శకులను ఏరి కోరి మరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ధమాకా డైరెక్టర్ తో కూడా ఒక సినిమా చేయాలి అని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

megastar chiranjeevi new project plan with dhamaka director trinadha rao nakkina

నేను లోకల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న తర్వాత త్రినాధరావు మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. ఇక మొత్తానికి రవితేజతో చేసిన ధమాకా సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లను దాటిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అతని టాలెంట్ ను చూసి మంచి కామెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకోమ్మని ఆఫర్ కూడా ఇచ్చాడట.

త్రినాధ రావు నక్కిన మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించడంలో మంచి టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు తగ్గట్టుగా అతను ఒక స్టోరీ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కథ సెట్ అయితే మాత్రం ఆ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. ఆ తర్వాత త్రినాధరావు స్టోరీ ఫిక్స్ అయితే ఈ కాంబోలో షూట్ తొందరగానే మొదలయ్యే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X