మళ్ళీ 20 ఏళ్ళ తరువాత ఆ సీనియర్ దర్శకుడితో మెగాస్టార్ మూవీ.. సెట్టవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జీ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నేటి తరం యువ హీరోలు వరుసగా నాలుగైదు సినిమాల్లో లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అలాగే సీనియర్ హీరోలు కూడా అదే తరహాలో ఎక్కువ సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అయితే వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. కుదిరితే మరి కొన్ని సినిమాలను కూడా ఓకే చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక నిత్యం యువ దర్శకులతో అలాగే సీనియర్ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ముందు నుంచి కూడా మెగాస్టార్ చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉంటారు.

ఒక దర్శకుడు చెప్పిన కథ నచ్చితే అతని అపజయాలను కూడా లెక్క చేయరు. కథ బాగుంటే ఆ దర్శకుడు ఫామ్ లో ఉన్నా లేకపోయినా ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదల కు సిద్దంగా ఉండగా.. ప్రస్తుతం ఆయన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో మరొక మాస్ కమర్షియల్ సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమాను కూడా స్టార్ చేయనున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి మరి కొన్ని సినిమాలను ముందుగానే సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సీనియర్ దర్శకులు యువ దర్శకులు అని తేడా లేకుండా అందరి దగ్గర నుంచి కూడా కథలు వింటున్నారు.

Megastar chiranjeevi new project with senior director gunasekhar

ఇక మళ్లీ 20 ఏళ్ల అనంతరం గుణశేఖర్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన చూడాలని ఉంది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక చివరగా 2001లో మృగరాజు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా మళ్లీ మెగాస్టార్ చిరంజీవి గుణశేఖర్ మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు గుణశేఖర్ ట్రాక్ లోకి రావడంతో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రానా దగ్గుబాటి తో హిరణ్యకశిప అనే మైథలాజికల్ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ లైనప్ లో మారుతి, సంపత్ నంది వంటి కమర్షియల్ దర్శకులు కూడా ఉన్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి ముందుగా ఎవరి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. త్వరలోనే ఈ లైనప్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X