మహేష్ కోసం మెగా హీరో టైటిల్.. రిజెక్ట్ చేసిన దర్శకుడితోనే ఆ సినిమా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ అంతకంటే ఎక్కువ స్థాయిలో సక్సెస్ చూడాలని మహేష్ చాలా పదునైన ప్రణాళికలు రచిస్తున్నాడు. వీలైనంత వరకు రిస్క్ చేయకుండా కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మిగతా హీరోలతో ఫ్రెండ్లిగా ఉంటూ ఒక విధంగా అభిమానుల సంఖ్యను కూడా పెంచుకుంటున్నాడు. అయితే త్వరలో మహేష్ స్టార్ట్ చేయనున్న ఒక సినిమాకు మెగా హీరో పాత సినిమా టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోలతో ఫ్రెండ్లిగా..

స్టార్ హీరోలతో ఫ్రెండ్లిగా..

మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిన విషయమే అలాగే సామాజిక విషయాలపై కూడా వివాదాలకు తావివ్వకుండా స్పందిస్తూనే వీలైనంత వరకు ఆర్థిక సహాయాలను కూడా అందిస్తూ ఉంటాడు. ఇక మిగతా స్టార్ హీరోలతో కూడా మహేష్ చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో మహేష్ సినిమా వేడుకలకి ఇతర స్టార్ హీరోలు చాలా మందే వచ్చారు.

 ఆ సినిమా తరువాత ఎవరితో..

ఆ సినిమా తరువాత ఎవరితో..

ఇక మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమాతో బిజీగా కానున్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేయనున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో ఒక సినిమాను అనుకున్నప్పటికి అది ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటి లేదు.

 మహర్షి దర్శకుడితోనే..

మహర్షి దర్శకుడితోనే..

సర్కారు వారి పాటను ముగించిన తరువాత మహేష్ కు కొంత గ్యాప్ అయితే వస్తోంది. రాజమౌళి సినిమా స్టార్ట్ కావాలి అంటే టైమ్ పడుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో త్వరగా ఒక సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక దర్శకుడు మరెవరో కాదు. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి అని టాక్ వస్తోంది. ఇంతకుముందు సరిలేరు నీకెవ్వరు అనంతరం ఈ దర్శకుడితోనే వర్క్ చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు.

Recommended Video

Super Star Mahesh Babu Financial Assistance To 2 Kids Heart Surgery | Filmibeat Telugu
 మెగాస్టార్ టైటిల్ ఫిక్స్..?

మెగాస్టార్ టైటిల్ ఫిక్స్..?

అప్పుడు స్టోరీ నచ్చక వంశీ పైడిపల్లి ప్రాజెక్టును ముందుకి తీసుకెళ్లలేకపోయిన మహేష్ ఇప్పుడు మాత్రం సరికొత్త స్టోరీతో మెప్పించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ను అనుకుంటున్నారట. మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆ సినిమాకు మెగాస్టార్ స్టేట్ రౌడి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 1989లో బి.గోపాల్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన స్టేట్ రౌడి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అదే టైటిల్ ను అనుకుంటున్నా వంశీ, మహేష్ బాబుకు ఎలాంటి హిట్టిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X