Vishwambhara విశ్వంభర నుంచి చిరంజీవి ఒరిజినల్​ లుక్ లీక్​ - రజనీ, బాలయ్య స్టైల్​లో! మీరు చూశారా?

మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా భోళా శంకర్ ఎఫెక్ట్ తో రూటు మార్చారు. మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్నఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ లీక్ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

చిరంజీవి సరసన త్రిష: బింబిసారతో తన సత్తా ఏంటో నిరూపించుకున్న వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం చిరంజివి తన రూటు మార్చాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వరుస షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మెగా​స్టార్‌ చిరంజీవి సరసన అందాల భామ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

Megastar Chiranjeevi Original Look Leak From Movie Full Details Here

ముగ్గురు హీరోయిన్లు: త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు తన సోషల్‌మీడియాలో చిరంజీవి పోస్ట్ కూడా చేశారు. త్రిషతో పాటు.. ఈషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే ఈ విశ్వంభరలో ఆయన కొత్తగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని గెటప్ లో కనిపిస్తారట. ఈ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తాయిని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

70 ఏళ్ల వయసు గెటప్ లో: షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి సుమారు 70 ఏళ్ల వయసుకు మించిన లుక్‌ లో కనిపిస్తారనే సమాచారం. అయితే చిరంజీవి ప్రస్తుతం వయసు 68. దాదాపు ఆయన ఒరిజినల్ లుక్ లోనే కనిపించనున్నారని తెలుస్తోంది. విశ్వంభరలో వృద్ధుడి పాత్రలో కనిపించి మరో ప్రయోగానికి మెగాస్టార్‌ తెరలేపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Megastar Chiranjeevi Original Look Leak From Movie Full Details Here

వారి తరహా పాత్రల్లో: దీనితో విశ్వంభరలో చిరంజీవి డ్యూయల్ రోల్ అని అర్ధం అవుతుంది. ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరొకటి మధ్యస్థ వయసు గెటప్ అని తెలుస్తోంది. ఇక ఓల్డ్ గెటప్ పాత్ర కీలకంగా మారనుందని సమాచారం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని డైరెక్టర్‌ విశిష్ట రూపొందిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. రజినీకాంత్, బాలకృష్ణ, కమల్ హాసన్ స్టైల్ లో చిరంజీవి సినిమాలు చేయబోతున్నారని అంటున్నారు.

రూటు మార్చిన చిరంజీవి: రజినీ, బాలయ్య, కమల్ తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. ఫ్యాన్స్ నుంచి ప్రసంశలు అందుకున్నారు. ఇప్పుడు విశ్వంభరతో చిరంజీవికూడా ఆ రూటులోకి మారారు. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై డైరెక్టర్‌ స్పెషల్ ఫోకస్ పెట్టారట. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X