మరో యువ దర్శకుడిని లైన్ లో పెడుతున్న మెగాస్టార్.. కిక్కిచ్చే కాంబినేషన్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకులకు కూడా మంచి అవకాశాలను ఇస్తున్నారు. టాలెంట్ ను వెతికి మరీ పట్టుకోవడంలో మెగాస్టార్ స్టైలే వేరుగా ఉంటుంది. ఒక విధంగా దర్శకులు ప్లాప్ అందుకున్నప్పటికీ కూడా వారిలో టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వరుస డిజాస్టర్స్ అందుకున్నప్పటికీ కూడా మెహర్ రమేష్ టాలెంట్ ఏమిటో ఇండస్ట్రీలో కొంతమందికి బాగా తెలుసు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అతనిని నమ్మే మంచి కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. వీరి కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న భోళా శంకర్ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా ఓకే చేయాలని అనుకుంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్య తో సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో యువదర్శకుడికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట తన రెండవ సినిమా కోసం స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. మొదట అతను కళ్యాణ్ రామ్ తోనే బింబిసారా సీక్వెల్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ వైపు ఫోకస్ చేసినట్లుగా ఒక టాపిక్ వినిపించింది. కానీ రజనీకాంత్ కథలో ఇంకాస్త మార్పులు చేయాలని సూచించారట.

ఇక మళ్ళీ ఇప్పుడు ఈ యువ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో మంతనాలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వశిష్ట మెగాస్టార్ ను ఒప్పించారా లేదా అనే విషయంలో ఇంకా అధికారికంగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇద్దరు కూడా ఒక కథపై అయితే చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ నెవర్ బిఫోర్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా వీరి కలయికలోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











