కూతురితో సినిమా చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ స్టామినా ప్రకారం ప్రస్తుతం 200 కోట్ల క్లబ్ హీరోగా ఉన్నాడు. ప్రస్తుతం టాప్ స్టార్స్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో మూడు సార్లు చేరిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే మెగాస్టార్ అనే బ్రాండ్ మీద మెగా హీర్లు అందరూ కూడా నిలబడి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు. ఇక పవర్ స్టార్ ఇటు సినిమాల ద్వారా అటు రాజకీయాలలో తనదైన ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూతురుని కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద కూతురు సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ వస్తుంది.

ఆమె నిర్మాతగా మారి ఒటీటీలో వెబ్ సిరీస్ లు కూడా నిర్మించారు. షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. తరువాత సేనాపతి అనే వెబ్ మూవీని కూడా నిర్మించింది. తాజాగా శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే మొదటి సినిమా అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దీంతో ప్రేక్షకులకి ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు సుస్మితని స్టార్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టడానికి మెగాస్టార్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ కలిపి స్టార్ట్ చేసిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా గత ఏడాది తమిళ్ లో సర్దార్ మూవీతో మెప్పించిన తమిళ్ దర్శకుడు మిత్రన్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి బీవీఎస్ రవి పవర్ ఫుల్ మాస్ కమర్షియల్ స్టొరీని రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో ఈ మూవీ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











