కొరటాల శివతో మూవీ.. డ్యూయెల్ రోల్‌లో మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత ఖైదీ నెం 150 చిత్రంతో ఘనంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. మరో మారు మెగాస్టార్ డ్యూయెల్ రోల్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video

సైరా చిత్రం తరువాత చిరంజీవి చేయబోతే చిత్రం కొరటాల శివతోనే అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి పోషించబోయే పాత్రల గురించి కూడా ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. కమర్షియల్ అంశాలతో సందేశాన్ని ఇవ్వడంతో కొరటాల శివ సిద్ధహస్తుడు. చిరంజీవి కోసం కూడా ఆయన అలాంటి కథనే సిద్ధం చేస్తున్నారట.

చిరు ఈ చిత్రంలో బిలీనియర్ అయిన ఎన్నారైగా, చిన్న గ్రామంలో రైతుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంచనాలు పెంచుతున్న ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావలసి వుంది. సైరా చిత్రం ఓ కొలిక్కి వచ్చాక కొరటాల శివ చిత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి నాలుగు వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో కొరటాల తిరుగులేని దర్శకుడిగా అవతరించారు.


Click it and Unblock the Notifications











