చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్.. మన శంకర వర ప్రసాద్ గారు కోసం ఎన్ని కోట్లంటే?

Mana Shankara Varaprasad Garu: టాలీవుడ్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారు ' ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్‌కు పేరుగాంచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్‌తోనే ఆసక్తిని రేపిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్, లిరిక్స్ ఇండస్ట్రీలో మరింత బజ్‌ను క్రియేట్ చేశాయి. మెగాస్టార్‌ యాక్టింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ ఓ స్పెషల్ మార్క్ గా నిలువబోతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ 'మన శంకర వర ప్రసాద్ గారు' కోసం మెగాస్టార్ ఎంత తీసుకుంటున్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబో తెరకెక్కుతున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో హీరోయిన్‌గా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. 'సైరా' తర్వాత మళ్లీ చిరంజీవితో ఆమె జత కడుతుండటం మూవీపై మరింత క్రేజ్ తెచ్చింది. అలాగే.. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల, 'దసరా' ఫేం షైన్ టామ్ చాకో వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రోమో దేశవ్యాప్తంగా యూట్యూబ్‌లో నంబర్ 1 ట్రెండ్‌లో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Megastar Chiranjeevi Record Remuneration for Mana Shankara Varaprasad Garu

ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ విక్టరీ వెంకటేష్.. ఈ మూవీలో వెంకీమామ క్యామియో రోల్ నటించబోతున్నారట. చిరంజీవి -వెంకటేష్ కలిసి స్క్రీన్‌పై కనిపించిన అవకాశాలు చాలా అరుదు. ఈసారి ఆ కలయికను అనిల్ రావిపూడి పూర్తి చేయబోతున్నారు. ఈ కాంబోను ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. వెంకటేష్, కేథరిన్ థ్రెసా మధ్య ముఖ్యమైన సీన్ పూర్తి చేశారంట. అదేవిధంగా చిరంజీవి, వెంకీ మామ కలిసి నటించే పబ్ సాంగ్ షూట్ త్వరలో జరగనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీక్వెన్స్ థియేటర్లలో భారీ రిపీట్ వాచ్‌ను తెచ్చే అవకాశం ఉందన్నది ఇండస్ట్రీలోని అంచనా.

ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన శంకర వర ప్రసాద్ గారు.. ఈ మూవీ కోసం చిరంజీవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం చిరంజీవి సుమారు రూ. 70 - 75 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా చిరంజీవి రెమ్యూనరేషన్ క్రమంగా పెరుగుతూ వస్తుండగా, ఈ చిత్రం కోసం తీసుకున్న పారితోషికం ఆయన కెరీర్‌లోనే అత్యధికమని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల పారితోషికం రూ.60 కోట్ల నుండి రూ. 120 కోట్ల మధ్యలో ఉండగా, ఈ సినిమా ద్వారా చిరంజీవి తన స్థానాన్ని మళ్లీ బలపరిచారనే ట్రేడ్ పండితుల టాక్.

ప్రొడక్షన్ బాధ్యతలను మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల చేపట్టడం మరో కీలక అంశం. ఆమె ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సెట్ డిజైనింగ్‌, ప్రొడక్షన్ క్వాలిటీ, లుక్స్ అన్ని విషయాలలో సుస్మిత ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా.. లాభాల్లో 50 శాతం వాటా సుస్మితకు ఉండబోతుందనే వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. దీంతో రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమామొత్తం బడ్జెట్ భారీ స్థాయిలో ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.

మామూలుగా సంక్రాంతి అంటే టాలీవుడ్‌లో స్టార్ హీరోల బాక్సాఫీస్ పోటీ. కానీ, ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ రాబోతుండటం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. మొత్తం ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. షూటింగ్ చివరి దశలో ఉండటంతో, ట్రైలర్, బడ్జెట్, పాత్రలపై మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశముంది. అన్నింటికంటే ముఖ్యంగా "పండగకు వస్తున్నారు" అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా.. 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో బాక్సాఫీస్‌ను కుదిపేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X