Unstoppable With NBK: హోస్ట్ గా చేయాలనుకున్న ఫస్ట్ హీరో అతనే.. ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?
నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఒక రియాలిటీ టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షోకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నందమూరి బాలకృష్ణ ఓటీటీ ప్రపంచంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తూ ఉండడం విశేషం. ఆహా షోలో బాలయ్య కనిపించబోతున్నారు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ప్రోమో ద్వారానే బాలయ్య భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాడు. తప్పకుండా ఈ రియాలిటీ టాక్ షో సక్సెస్ అవుతుందని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అన్‌స్టాపబుల్ షో కోసం మొదట ఒక స్టార్ హీరో అనుకున్నారట. కానీ ఆ హీరో మాత్రం కొన్ని రోజులు ఆలోచించి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సరికొత్త నిర్ణయాలతో..
నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తర్వాత సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా నేటి తరం ప్రేక్షకులు కూడా ఆకట్టుకోవాలని కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని దర్శకులకు ప్రత్యేకంగా సలహాలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య నెవర్ బిఫోర్ ఎలా అభిమానులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే
బాలకృష్ణ మొదటి సారీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే ఒక టాక్ షో తో రాబోతున్నారు. ప్రస్తుత కాలంలో కొందరు సీనియర్ హీరోలు యువ హీరోలు కూడా హోస్ట్ గా చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా షోలు చేయగలిగితే భవిష్యత్తు సినిమాలకు ఎంతగానో హెల్ప్ అవుతుందని అభిమానుల సంఖ్య కూడా పెంచుకోవచ్చు అని నేటి తరం హీరోలు ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాకుండా హోస్టింగ్ చేస్తే రెమ్యునరేషన్ రూపంలో భారీగా ఆదాయం కూడా పెరుగుతుంది. బాలయ్యకు దాదాపు 5కోట్ల వరకు దక్కినట్లు తెలుస్తోంది.

రిజెక్ట్ చేసిన మెగాస్టార్
బాలకృష్ణ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్‌స్టాపబుల్ షో కోసం మొదట ఒక సీనియర్ హీరోను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ స్టార్ హీరో మరెవరో కాదు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అని కథనాలు వెలువడుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ మొదట ఏదైనా రియాల్టీ షో చేయాలి అని చాలా ప్రయత్నాలు చేసాడు. అందులో భాగంగానే అన్‌స్టాపబుల్ షో కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు.. చెప్పగానే మొదట్లో కొంత ఆసక్తి కనబరిచిన చిరంజీవి ఆ తర్వాత మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గాడు.

మెగాస్టార్ ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?
మెగాస్టార్ చిరంజీవి గతంలోనే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాల్టీ షో తో హోస్ట్ గా మెప్పించిన విషయం తెలిసిందే. హోస్ట్ గా చేయాలని మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. మెగాస్టార్ ఆసక్తి చూపారు కాబట్టే అల్లు అరవింద్ ఆహా టాక్ షోను మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడం వలన బిజీగా ఉండాల్సి ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Recommended Video

మొదలయ్యేది ఎప్పుడంటే..
అన్‌స్టాపబుల్ షో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అని అల్లు అరవింద్ బాలయ్య దగ్గరకు వెళ్ళాడు. మొదట్లో కాస్త ఆలోచించిన బాలయ్య ఆ తర్వాత మాత్రం కాన్సెప్ట్ గురించి తెలిసి వెంటనే చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అనంతరం అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక షో ఈ నెల 4 నుంచి మొదలు కాబోతోంది. మరి బాలయ్య మొదటిసారి చేస్తున్న ఈ షో అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











