ఆ పని చేస్తూ చిరంజీవికి అడ్డంగా బుక్కైనా రానా, రామ్ చరణ్.. పాపం లీక్ చేసేశాడు భయ్యా!
సినీ ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ కిడ్స్ మధ్య మంచి స్నేహబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- దగ్గుబాటి రానా కూడా ఒకరు. వీరిద్దరూ చదువుకునే రోజుల నుంచే చాలా మంచి స్నేహితులు. దీంతో ఎక్కడికీ వెళ్లినా ఇద్దరు కలిసే తిరిగేవారట. అయితే రాత్రుళ్లు ఎవరీకీ తెలీకుండా అలా చేసేవారట. వివరాళ్లోకి వెళితే...
రామ్ చరణ్-రానా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్సే. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరు చిన్నప్పటి కలిసి చదువుకున్నారు. మంచి ఫ్రెండ్స్ కూడా. ఈ విషయాన్ని ఇద్దరు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలానే ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని కూడా చాటుకున్నారు.

అయితే వీరిద్దరు కలిసి రాత్రుళ్లు కంబైన్ స్టడీస్ కూడా చేసేవారట. అయితే రాత్రుళ్లు వీరిద్దరు చేసిన సీక్రెట్ పని గురించి మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ షోలో బయటపెట్టారు. అదేంటంటే.. స్నేహితులు అన్నాక
కలిసి తినడం, తిరగడం.. వగైరా ఇంకేవైనా కలిసి సరదా చిలిపి చేష్టలు చేయడం సహజం. ఇక సెలబ్రిటీల పిల్లలు అంటే వాళ్ల రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక రామ్ చరణ్ - రానా విషయానికొస్తే.. ఇద్దరు కలిసి కంబైన్ స్టడీస్ చేసేవారట. గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకొని కాసేపు చదువుకున్నట్టు నటించేవారట. ఆ తర్వాత కిటికీలకు ఉండే గ్రిల్స్ ఓపెన్ చేసి.. రహస్యంగా బయటికి వెళ్లిపోయేవారట. బయట చాలా సేపు తిరిగేసి, సరదా షికార్లు కొట్టి.. మళ్లీ ఏమీ తెలియనట్లు ఆ గ్రిల్స్ ద్వారా ఇంట్లోకి వచ్చి సైలెంట్ గా చదువుకుంటున్నట్టు నటించేవారట. ఈ విషయంలో ఓ రోజు తెలిసిపోయిందట. ఈ విషయాన్నే మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ సారి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రామ్ చరణ్ - రానా కెరీర్ విషయానికొస్తే. తమిళ. దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో 'గేమ్ ఛేంజర్' అనే సినిమాలో నటిస్తున్నారు చరణ్. ఇది పొలిటికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సినిమా చేయబోతున్నారు.
ఇందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే రానా రీసెంట్ గా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించారు. త్వరలోనే దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నారు.


Click it and Unblock the Notifications











