ప్రభాస్, చిరంజీవి మల్టీస్టారర్.. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా స్టార్ డైరెక్టర్ ప్లానింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న చిత్రం స్పిరిట్. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ కోసం సందీప్ అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. స్క్రిప్ట్, నిర్మాతలు, నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ అందరినీ సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ కావాల్సింది ప్రభాస్ మాత్రమే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే స్పిరిట్ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తొలి సినిమా కావడంతో స్పిరిట్‌పై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ప్రభాస్ కటౌట్, ఇమేజ్‌కు తగినట్లుగా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉపయోగించి ఈ సినిమాను సిద్ధం చేయనున్నారట సందీప్.
సందీప్ చెప్పిన పాయింట్ నచ్చడంతో రెండేళ్ల క్రితమే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే అప్పటికే సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్ వంటి సినిమాల షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వీటిని త్వరగా పూర్తి చేసి స్పిరిట్ సెట్‌లో జాయిన్ అవ్వాలని డార్లింగ్ భావించారు. సందీప్ హీరోలు తొలి నుంచి వయలెంట్‌గా, సీరియస్ లుక్‌లో ఉంటారు. అలాంటిది ప్రభాస్‌ను సందీప్ ఎలా చూపించబోతున్నారు? అంటూ ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ యూనిఫాంలో కనిపించనున్నారని ఊహాగానాలతో పాటు ఫ్యాన్ మేడ్ ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు చేసిన ప్రభాస్ ఇప్పటి వరకు ఖాకీ డ్రెస్ వేయలేదు. దాంతో ఆయన కనుక లాఠీ పట్టుకుంటే బాక్స్‌లు బద్ధలేనని అభిమానులు అంటున్నారు. అయితే అధికారికంగా స్పిరిట్ మూవీ ప్రారంభం కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఈ దశలో న్యూఇయర్ గిఫ్ట్ కింద సైలెంట్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి స్పిరిట్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు సందీప్. బాగా హెయిర్ పెంచి.. గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా ఒళ్లంతా గాయాలతో వాటికి బ్యాండేజ్‌లతో రఫ్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్. ఓ చేతిలో మందు పట్టుకుని నోటిలో సిగరెట్ పెట్టుకోగా.. అతనికి ఎదురుగా నిలబడ్డ హీరోయిన్ తృప్తి దిమ్రి లైటర్‌తో సిగరెట్‌ను వెలిగిస్తోంది. ఈ పోస్టర్ చిత్ర సీమను ఊపేసింది. ప్రేక్షకులు వేరే హీరోలు, హీరోయిన్‌లతో ఈ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించి వైరల్ చేశారు.
పోస్టర్ వదిలిన కొద్దిరోజులకే సందీప్ మరో షాకిచ్చారు. స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 16న ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, కొరియన్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సందీప్ తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. త్వరగా సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.
స్పిరిట్‌లో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ కూడా డార్లింగ్‌తో రొమాన్స్ చేయనుందని ఫిలింనగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్, అలనాటి నటి కాంచనలు కీలకపాత్రలు పోషించనున్నారని టాక్. భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌లు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలాఉండగా .. స్పిరిట్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ సూపర్‌స్టార్ కీలకపాత్ర పోషించనున్నారట. ఆయన ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. స్పిరిట్‌లో సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చిరంజీవి ఓ 15 నిమిషాల పాటు కనిపించనున్నారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. కథను మలుపు తిప్పేలా చిరంజీవి పాత్ర ఉంటుందని గాసిప్స్ వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే సందీప్ రెడ్డి వంగాకు ఫెవరెట్ హీరో చిరంజీవి. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారు. ఇక స్పిరిట్ మూవీ ప్రారంభోత్సం కార్యక్రమం కూడా చిరంజీవి చేతుల మీదుగానే జరిగింది. ఈ పరిణామాలన్నీ పై ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా ప్రభాస్ - చిరంజీవిలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం రికార్డులు బద్ధలు కావాల్సిందే. మరి స్పిరిట్‌లో మెగా ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











