ఆ విషయంలో రామ్ చరణ్ అట్టర్ ఫ్లాప్.. తండ్రి మాటకు నో చెప్పినందుకే!
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ మహా వృం. ఆయన ద్వారానే ఆ కుటుంబంలో ఎంతో మంది హీరోలు బయటకు వచ్చారు. అలానే ఆయన స్ఫూర్తితో బయట నుంచి చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అయితే చరణ్.. ఓ సారి చిరంజీవి వద్దన్నా కూడా ఓ సినిమా చేశారట. కానీ అది బోల్తా కొట్టింది. అదేంటో తెలుసుకుందాం. వివరాళ్లోకి వెళితే..
నో బ్యాక్ గ్రౌండ్.. కానీ ఇప్పటికీ: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా స్టార్ గా ఎదిగారు. స్వయంకృషితో కష్టపడి ఈ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఆయన ఎవరూ అందుకోలేని ఈ మెగా స్టార్ స్థాయికి ఎదగడానికి ముఖ్య.. ఆయన నటన. అలాగే ఆయన ఎంచుకొనే సినిమాలు కూడా ఓ కారణం. తన బాడీ ల్యాంగేజ్ కు తగ్గటు కథలను సెలెక్ట్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.

ఆ ఒక్క విషయంలో: ఇక చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. తొలి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండో చిత్రం 'మగధీర'ను రాజమౌళి దర్శకత్వంలో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఆ తర్వాత 'ఆరెంజ్', 'రచ్చ', 'నాయక్', 'ఎవడు' సహా పలు చిత్రాలు చేసిన అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
రాంచరణ్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచాయి. కానీ చెర్రీ స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు 'RRR' తో బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అయితే చరణ్ సినిమా ఎంపిక విషయంలో మొదట్లో చిరు సలహా తీసుకునేవారట. కానీ ఓ చిత్రం విషయంలో మాత్రం చిరు మాట కాదని ఓ అడుగు ముందుకు వేశారట.

పాపం బోల్తా కొట్టింది: అదే 'తుఫాన్'. అది కాస్త బోల్తా కొట్టింది. వాస్తవానికి.. ఈ చిత్ర కథను చిరు విని.. సినిమా సూట్ అవ్వదని చెప్పారట. కానీ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం.. ఈ సినిమాను ప్రయత్నించారట. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్. కానీ ఈ చిత్రం అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సమాచారంలో నిజమెంతో తెలీదు కానీ బయట మాత్రం ఇలా కథనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











