ఎన్టీఆర్ కి చిరంజీవి స్పెషల్ ట్రీట్.. ఎవరూ ఊహించని విధంగా.. స్వయంగా వండి మరీ!

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది మొదలు అన్ని విషయాల గురించి స్పందిస్తూ, అనేక విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు. అయితే తాజాగా చిరంజీవి ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ట్రీట్ అందించినట్లు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్టీఆర్ బర్త్ డే

ఎన్టీఆర్ బర్త్ డే

ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అటు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రేడవుతోంది..

 కరోనా బారిన పడి

కరోనా బారిన పడి

నిజానికి కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన తాను కోరుకుంటున్నానని కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతారు అని భావించి ముందే ఆయన ఎలాంటి వేడుకలు జరుప వద్దు అని క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు అభిమానులకు బహిరంగ లేఖ రాసిన ఎన్టీఆర్ కరోనా పరిస్థితుల్లో ఇలాంటి వేడుకలు చేయవద్దని దానికి వెచ్చించాలి అనుకున్న మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు.

ఎన్టీఆర్ కి చిరు కాల్

ఎన్టీఆర్ కి చిరు కాల్

ఇక ఇటీవల కరోనా బారినపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు.. తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన చిరు, తను క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తారక్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారన్న ఆయన, అతని ఫ్యామిలీ మెంబర్స్ క్షేమంగా ఉన్నారని తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషించానని చెప్పుకొచ్చారు

స్పెషల్ ట్రీట్

స్పెషల్ ట్రీట్

ఇక ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ జీవితంలో మరిచిపోలేని విధంగా ఒక గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఎన్టీఆర్ భోజనప్రియుడు, ఆయన మంచి మంచి వంటకాలను ఆస్వాదిస్తారు. ఈ విషయం చిరంజీవికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్వయంగా ఎన్టీఆర్ కోసం ఒక డిష్ పంపించారని తెలుస్తోంది.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
స్వయంగా బిర్యాని వండి

స్వయంగా బిర్యాని వండి

సుమారు నెల రోజుల క్రితం చిరంజీవి తారక్ కోసం స్పెషల్ గా ఆఫ్ఘనిస్తాన్ కొండలలో పెరిగిన ఒక మేక పిల్లను కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఈరోజు దాంతో మటన్ బిర్యానీ స్వయంగా వండి తారక్ ఇంటికి స్పెషల్ గా చిరంజీవి పంపించినట్లు సమాచారం. బిర్యానీ అందులో మటన్ బిర్యానీ అంటే తారక్ కి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్వయంగా వండి మరీ పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X