ఆచార్య కోసం మెగాస్టార్ సెంటిమెంట్ డేట్.. ఇదే ఫిక్స్ చేసేలా ఉన్నారు!
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకోగలదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా మెగాస్టార్ సెంటిమెంట్ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక మెగాస్టార్ కెరీర్ లో మరచిపోలేని తేదీలలో మే 9 ఒకటి. 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ తరువాత 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే రోజున వచ్చింది. ఆ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక చాలా కాలం తరువాత మెగాస్టార్ కన్ను మళ్ళీ ఆ డేట్ పైనే పడినట్లు తెలుస్తోంది. మే9న ఆచార్య విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ ఫిక్స్ అయితే ఆ దరిదాపుల్లో వారి సినిమాలను రిలీజ్ చేయవద్దని అనుకుంటున్నారు. మరి ఆచార్య సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











