పుష్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. ఒకే ఫ్రేమ్ లో బన్నీతో కలిసి.. రచ్చ రచ్చే..

ఇండియన్ సినిమా వరల్డ్ లో రానున్న రోజుల్లో టాలీవుడ్ కూడా బాలీవుడ్ తో సమానంగా పోటీ పడగలదని చెప్పవచ్చు. ఇప్పటికే బహుబలి సినిమాతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవుతుండడంతో సినిమాల మార్కెట్ వాల్యూ కూడా అంతకంతకు పెరుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.

వందల మిలియన్ల వ్యూవ్స్

వందల మిలియన్ల వ్యూవ్స్

బాలీవుడ్ కంటే మన సినిమాలు ఏ మాత్రం తక్కువ కాదని నార్త్ జనాలకు తొందరగానే తెలిసొచ్చింది. ముఖ్యంగా మన కమర్షియల్ సినిమాలును హిందీలో డబ్ చేసి విడుదల చేస్తుంటే ఒక రేంజ్ లో క్లిక్కవుతున్నాయి. ఆఖరికి బిగ్ స్క్రీన్ పై డిజాస్టర్ అయిన సినిమాలు కూడా మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం. అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా వందల మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.

పుష్ప సినిమాలో మాస్ డ్యాన్స్

పుష్ప సినిమాలో మాస్ డ్యాన్స్

ఇక అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ మూవీగా రాబోతున్న పుష్ప సినిమా కోసం కేవలం సౌత్ అడియెన్స్ అనే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ డ్యాన్స్ కు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా బన్నీ యాక్షన్ తో పాటు డ్యాన్స్ తో కూడా మంచి కిక్కిస్తాడాని చెప్పవచ్చు.

పుష్ప సినిమాలో మెగాస్టార్

పుష్ప సినిమాలో మెగాస్టార్

అయితే పుష్ప సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక గాసిప్ వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అని కూడా కథనలు పుట్టుకొస్తున్నాయి. అదే నిజమైతే గనక మెగా అభిమానుల ఆనందానికి అడ్డు ఉండదు.

ఒక పాటలో స్పెషల్ డ్యాన్స్

ఒక పాటలో స్పెషల్ డ్యాన్స్

ఇన్ సైడ్ టాక్ ప్రకారం మెగాస్టార్ ఎలాంటి స్పెషల్ పాత్రలలో నటించడం లేదు. కానీ అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మెగా హీరోలు చాలా వరకు మెగాస్టార్ సినిమాల్లో స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీ కోసం పుష్ప సినిమాలోని ఒక మాస్ పాటలో మెగాస్టార్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X