తనయుడికి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిపై చిరు స్పెషల్ ఇంట్రెస్ట్.. మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సైరాతో సరికొత్తగా కనిపించిన చిరు ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన కథల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

ఆ సినిమాపై అనుమానాలు లేవు

ఆ సినిమాపై అనుమానాలు లేవు

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమాతో బాక్సాఫీడ్ హిట్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు అపజయం లేని పక్కా కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ సినిమాను అన్ని వర్గాలకు నచ్చే విధంగా డిజైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులకు పెద్దగా అనుమానాలు లేవు.

 మెగా అభిమానుల్లో ఆందోళన

మెగా అభిమానుల్లో ఆందోళన

అయితే ఆ తరువాత మెగాస్టార్ తో వర్క్ చేయనున్న దర్శకుల లిస్ట్ కొంత ఆందోళన కలిగిస్తోంది. పైగా అవన్నీ జనాలకు తెలిసిన రీమేక్ కథలే. ఆచార్య అనంతరం వేదళం రీమేక్ ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు శక్తి, షాడో చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.

ఫామ్ లో లేని దర్శకుడితో..

ఫామ్ లో లేని దర్శకుడితో..

ఇక లూసిఫర్ కథను సీనియర్ దర్శకుడైన వినాయక్ చేతిలో పెట్టారు. ప్రస్తుతం ఫామ్ లో లేని వినాయక్ ఎంత ప్రయత్నం చేసినా కూడా హీరోలు కథలు వినకుండా మొహం చాటేస్తున్న సమయంలో మెగాస్టార్ పిలిచి మరి అవకాశం ఇచ్చారు అంటే ఒక మనిషిని ఎంతగా నమ్ముతారో అర్థం చేసుకోవచ్చు. కానీ వినాయక్ ఈ సారి అంచనాలకు తగ్గట్టుగా మెప్పిస్తాడా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

#Hyderabad Floods Tollywood Heros Huge Donations హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్.విరాళాలు
బోయపాటితో కూడా..

బోయపాటితో కూడా..

ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ తో కూడా మెగాస్టార్ వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి , మెగాస్టార్ కాంబినేషన్ పై గతంలోనే ఒక ఎనౌన్స్మెంట్ వచ్చింది. అల్లు అరవింద్ కూడా ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు గాని వర్కౌట్ కాలేదు. అసలైతే సైరా తరువాత ఈ దర్శకుడితోనే చేయాలి. కానీ కుదరలేదు. ఇక తనయుడికి వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ మళ్ళీ అతనీతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఒక ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X