పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ టైటిల్.. ఫిక్స్ అయినట్లే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో గాని రాజకీయాల్లో బిజీ పర్సన్ అయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. నిజంగా పవన్ ఈ రేంజ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడాని ఎవరు ఊహించలేదు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతుండగానే మరో సినిమాకు ఒకే చెప్పారు.

దసరా సందర్భంగా మలయాళం రీమేక్ అయ్యప్పన్ కొశీయుమ్ కథకు ఒప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అప్పట్లో ఒక్కడుండేవాడు అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు సాగర్ చంద్ర ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఆ సినిమాకు మెగాస్టార్ ఓల్డ్ మూవీ టైటిల్ ని సెట్ చేయాలని అనుకుంటున్నారట. 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన చిత్రం బిల్లా రంగా. ఇక ఆ సినిమా టైటిల్ ని ఈ మలయాళం రీమేక్ కోసం వాడనున్నారట.

Megastar chiranjeevi title for Pawan kalyan upcoming malayalam remake

ఇక మరో హీరో రానా దగ్గుబాటి పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సినిమాను ఒరిజినల్ కథలా కాకుండా తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు సరికొత్తగా మళ్ళీ రీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సాగర్ చిన్న దర్శకుడే అయినప్పటికీ అతను స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్న విధానంపై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X