విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్‌తో!

విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో రోజు రోజుకు సంచలనంగా మారుతున్నాడు. విభిన్నమైన శైలి, యువతని మెప్పించే నటనతో ఆకట్టుకుంటున్నాడు. యువతలో విజయ్ దేవరకొండకు ఇంతలా క్రేజ్ పెరగడానికి కారణం అతడు ఎంచుకుంటున్న కథలు ఒక ఎత్తైతే, ప్రతి చిత్రంలో తన ప్రత్యేకత చాటుకోవడం మరో ఎత్తు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టి మొత్తం విజయ్ దేవరకొండపై పడింది. ఆ తరువాత కూడా హిట్స్ పడడంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాల గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.

రెండు విజయాలు

రెండు విజయాలు

విజయ్ దేవరకొండ నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. వాటిలో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. పొలిటికల్ డ్రామాగా వచ్చిన నోటా నిరాశపరిచింది. గీత గోవిందం చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చి వసూళ్ల సునామి సృష్టించింది. హర్రర్, థ్రిల్లర్ అంశాలతో వచ్చిన నోటా చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

డియర్ కామ్రేడ్‌తో బిజీ

డియర్ కామ్రేడ్‌తో బిజీ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన ఈ చిత్రంలో మరోమారు విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని విజయ్ లైన్లో పెడుతున్నాడు.

మెగాస్టార్ టైటిల్

మెగాస్టార్ టైటిల్

మెగాస్టార్ చిరంజీకి నటించిన హీరో చిత్రం 1984లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ టైటిల్ పై విజయ్ దేవరకొండ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాత చిత్రాల టైటిల్స్ ని రిపీట్ చేస్తే ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. గతంలో చాలా మంది హీరోలు పాత చిత్రాల టైటిల్స్ తో సినిమాలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ప్లాప్ అయినా కూడా

ప్లాప్ అయినా కూడా

విజయ్ దేవరకొండ నటించిన తొలి తమిళ చిత్రం నోటా.తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా వచ్చిన నోటా పూర్తిగా నిరాశపరిచింది. అయినా కూడా విజయ్ దేవరకొండ తమిళంలో మరో ప్రయత్నానికి అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. శ్రీకార్తిక్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రచారంలో ఉన్న హీరో టైటిల్ ఈ చిత్రం కోసమేనా అనేది తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X