ఆ ఇద్దరి హీరోలతో నిర్మాతగా మెగాస్టార్ మల్టీస్టారర్ ప్లాన్.. సెట్టయితే హిట్టే..?

మెగాస్టార్ చిరంజీవి రాబోయే సినిమాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలన్నీ కూడా చాలా భిన్నమైన కథాంశాలతో తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అందులో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా అలాగే మాస్ లుక్కుతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి అదే దర్శకుడు ద్వారా మరొక కథను కూడా విన్నట్లు సమాచారం. ఆ కథ మల్టీస్టారర్ కావడంతో మొదట మోహన్ రాజా చిరంజీవి రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని అనుకున్నారట. కానీ మెగాస్టార్ మాత్రం ఇప్పట్లో మళ్లీ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం లేదని ఆ కథను అక్కినేని హీరోలకు ఫార్వర్డ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Megastar chiranjeevi to produce a movie with akkineni heros

అక్కినేని నాగార్జున అఖిల్ అయితే కథకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అవసరమైతే మరిన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు అని తనదైన శైలిలో కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్లు టాక్. ఇక నాగార్జున ఇంకా ఆ కథపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాతనే అతను మరొక సినిమా గురించి ఆలోచించాలని అనుకుంటున్నాడు. ఇప్పటివరకు నాగచైతన్యతో రెండు సినిమాలు చేసిన నాగార్జున అఖిల్ తో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాడు. కానీ సరైన కథ సెట్ అవ్వడం లేదు. ఇక తనకు మిత్రుడైన మెగాస్టార్ చిరంజీవి ఒక కథను సజెస్ట్ చేయడంతో దాని గురించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు సెట్ అయితే మెగాస్టార్ స్వయంగా తన హోం ప్రొడక్షన్ కొనిదెల సంస్థలోనే ఆ సినిమాను నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X