మెగాస్టార్ కోసం పోటీగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. అందరి చూపు అమెవైపే..
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూస్తుంటే రానున్న రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండానే వస్తాయని అర్ధమవుతోంది. ఆచార్యతో కలిపి మెగాస్టార్ వరుసగా నాలుగు సినిమాలను అయితే లైన్ లో పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా అయిపోగానే వెంటనే లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మెహర్ రమేష్, బాబీ సినిమాలను కూడా సెట్స్ పైకి తెనున్నాడు. అయితే బాబీతో చేయబోయే సినిమాలో హీరోయిన్స్ పై అప్పుడే చర్చలు మొదలైనట్లు సమాచారం. దర్శకుడు బాబీ ఇద్దరు హీరోయిన్స్ పేర్లను మెగాస్టార్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.

మైత్రి మూవీ మేకర్స్ లో రూపొందనున్న ఆ సినిమాలో శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య పోటీ పేరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని చర్చలు అయితే మొదలయ్యాయి. ఇక ఎక్కువగా అందరి ఫోకస్ శృతి హాసన్ పైనే ఉంది. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే మాత్రం ఆ ఛాన్స్ రకుక్ ప్రీత్ సింగ్ కు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇద్దరిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. త్వరలోనే సినిమాపై దర్శకుడు బాబీ ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











