బాలకృష్ణ చేయాల్సిన సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ డైరెక్టర్ అస్సలు తగ్గట్లేదు
ఒక సినిమా పూర్తయిన తరువాత గాని మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాని అగ్ర హీరోలు ఇటీవల కాలంలో మాత్రం ఓకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. సీనియర్ దర్శకులు యంగ్ డైరెక్టర్స్ అని తేడా లేకుండా ఎవరు కథ చెప్పిన వినేస్తున్నారు కొంతమంది హీరోలు. ముఖ్యంగా మెగాస్టార్ అయితే రానున్న రోజుల్లో నాన్ స్టాప్ సినిమాలతో కిక్కివ్వబోతున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. అయితే బాలయ్య చేయాల్సిన ఒక కథ ఇప్పుడు మెగాస్టార్ కాంపౌండ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటుందట.

ఆచార్య.. టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
మెగా స్టార్ చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. కొరటాల శివతో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మెగాస్టార్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

లైన్ లో మరో మూడు
ఆచార్య అనంతరం లూసిఫర్ రీమేక్ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ను సెట్స్ పైకి తెనున్న విషయం తెలిసిందే. అలాగే జైలవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఒక యాక్షన్ కమర్షియల్ యాక్షన్ సినిమా చేయబోతున్నారు.
అయితే ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథపై మెగాస్టార్ పాజిటివ్ గా స్పందించారని టాక్ వస్తోంది.

బిష్మ దర్శకుడితో కూడా
నితిన్ తో గత ఏడాది భీష్మ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆ దర్శకుడికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో ఒక కమిట్మెంట్ ఉంది. ఇక ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కుడుముల ఇటీవల మెగాస్టార్ కు అయితే ఒక కథను వినిపించాడట. మెగాస్టార్ అతని కథపై పాజిటివ్ గా స్పందించినప్పటికి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది.

బాలయ్య కోసం అనుకున్న కథలో..
అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. కృష్ణవంశీ కొన్నేళ్ల క్రితం రైతు అనే కథను రాసుకొని బాలకృష్ణతో చేయాలని ట్రై చేశారు. అందులో ఒక ముఖ్యమైన పాత్రకు అమితాబ్ బచ్చన్ ను అనుకున్నారు. అయితే అందుకు అమితాబ్ ఒప్పుకోలేదు. ఇక అమితాబ్ ఒప్పుకోకపోతే ఆ సినిమా చేయనని బాలయ్య చెప్పడంతో కృష్ణవంశీ ఇప్పుడు మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కథను మారుస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది ఏండింగ్ లో ఆ సినిమాను స్టార్ట్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











