Megastar chiranjeevi: వరుసగా 5 సినిమాలను లైన్‌లో పెట్టిన చిరు.. అదిరిపోయే టైటిల్స్ కూడా..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరు బదులు వయసులో కూడా యువ హీరోల తరహాలోనే డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తన అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక అంశాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టార్ దర్శకులు కూడా మెగాస్టార్ ఆలోచనలకు తగ్గట్లుగానే ఆయన బాడీ లాంగ్వేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకొని కథలను రెడీ చేసుకుంటున్నారు. కథ ఏమాత్రం నచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి దర్శకుల గత సినిమాల రిజల్ట్ గురించి సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు.

వాళ్లకు ఫ్లాప్స్ ఉన్నాయా హిట్స్ ఉన్నాయా అనే విషయం కన్నా కూడా చెప్పిన కథలు ఎంత నమ్మకంగా తెరకెక్కించగలరు అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక్కసారి నమ్మితే మళ్లీ సినిమా పూర్తయ్యే వరకు కూడా మెగాస్టార్ దర్శకుడికి పూర్తిస్థాయిలో ఫ్రీడమ్ ఇస్తుంటారు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు సినిమా షూటింగ్స్ మొదలు కాకముందే కొన్ని సినిమాలకు టైటిల్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆచార్య సినిమా ఎప్పుడంటే..

ఆచార్య సినిమా ఎప్పుడంటే..

ముందుగా మెగాస్టార్ చిరంజీవి.. ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది.

ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ టికెట్ల రేట్లు అందుబాటులోకి వస్తే తప్పకుండా విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దసరా సమయంలో సినిమా వచ్చే చాన్స్ ఉందని ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది.

గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్

గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్

ఇక మెగాస్టార్ చిరంజీవి మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే ముందుగా లూసిఫర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చారు. మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా టైటిల్స్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి ఇక ఫైనల్ గా గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బోళా శంకర్

బోళా శంకర్

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి 66 వసంతంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ పుట్టినరోజు సందర్భంగా దాదాపు మెగాస్టార్ నుంచి రాబోయే సినిమాలన్నీటీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. సినిమాకు బోళా శంకర్ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నారు.

ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు కూడా వెలువడుతున్నాయి. దర్శకుడు బాబి ఈ సినిమాను మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ట్లు సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే వింటేజ్ మెగాస్టార్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నారు మెగాస్టార్ పాత్ర అలాగే స్టైల్ ఫైట్స్ డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులు విజిల్స్ వేసే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

అందరి ఫోకస్ అతనిపైనే

అందరి ఫోకస్ అతనిపైనే

ఇక అందరి చూపు ఎక్కువగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయనున్న వేదళం సినిమా పైనే ఉంది. ఎందుకంటే దర్శకుడు మెహర్ రమేష్ గతంలో తీసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే రీమేక్ చేయడంలో మాత్రం మెహర్ రమేష్ పెద్దగా ఫెయిల్ అవ్వలేది. అతనిపై ఓ వర్గం వారికి గట్టి నమ్మకం అయితే ఉంది.

ఆ విషయం గురించి కూడా మెగాస్టార్ చాలా సార్లు మెహర్ రమేష్ తో చర్చలు జరిపినట్లు టాక్. హిట్టయిన సినిమాల కథలు నువ్వు తప్పకుండా రీమేక్ చేయగలిగితే మరొక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవచ్చని చెప్పాడట. అందుకే మెహర్ రమేష్ వేదళంను మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.

Recommended Video

Blockbuster Mechanic Alludu చిత్ర విశేషాలు.. ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్ || Filmibeat Telugu
వాల్తేర్ వీరయ్య..

వాల్తేర్ వీరయ్య..

మెహర్ రమేష్ గతంలో పలు బాక్సాఫీస్ హిట్ సినిమాలకు కూడా రైటర్గా వర్క్ చేశాడు అందులో పోకిరి దేశముదురు లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి అతన్ని అంత గట్టిగా నమ్ముతున్నారు. 155 సినిమాగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టుకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో కూడా మెగాస్టార్ నెవర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ స్టైల్ తో కనిపిస్తాడని తెలుస్తోంది ఎక్కువగా సందేశాన్ని ఇచ్చే అంశాలు ఈ కథలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటాడు అని చెప్పవచ్చు. అలాగే మారుతి దర్శకత్వంలో 156వ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల కథనాలు అయితే వెలువడుతున్నాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X