విశ్వంభర సినిమాలో హిట్లర్ సెంటిమెంట్.. చిరు చెల్లెల్లుగా ఏ హీరోయిన్లు కనిపించబోతున్నారంటే?

తెలుగు సినీ రంగంలో సీనియర్ హీరోల హవా ఇప్పటికీ కొనసాగుతోంది. కుర్ర హీరోల కంటే కూడా సీనియర్ హీరోలే ఎక్కువగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాకు హిట్లర్ టచ్ ఉంటుందని తెలుస్తోంది.

'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న 'విశ్వంభర' సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలోలాగా.. ముల్లోకాలకు సంబంధించిన కథ అని అంతా అన్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.

Megastar Chiranjeevi Vishwambhara Movie Similar to Hitler With Socio Fantasy Touch Check Details

చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి తల్లి చిన్నప్పుడే చనిపోగా.. తన ఐదుగురు చెల్లెల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చాలా కష్టపడి పైకి ఎదిగి వారిని బాగా చదివస్తాడు. ఇలా చివరకు వారి పెళ్లిళ్లు చేశాడు, ఏం చేశాడు అన్నది అసలు కథ. ముఖ్యంగా ఈ స్టోరీ మొత్తం అన్నాచెల్లెల సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తాజాగా విశ్వంభర సినిమాలోనూ అదే రిపీట్ కాబోతుందని టాక్ నడుస్తోంది.

Megastar Chiranjeevi Vishwambhara Movie Similar to Hitler With Socio Fantasy Touch Check Details

ముఖ్యంగా విశ్వంభర సినిమాలో కూడా చిరంజీవికి మొత్తం ఐదుగురు చెల్లెల్లు ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్లను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయగా.. ఎవరెవరు చిరంజీవికి చెల్లెల్లుగా కనిపించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్, సురభి, ఆషికా రంగనాథ్ లు చిరుకు చెల్లెల్లుగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఇంకో రెండు పాత్రల్లో అంటే మరో ఇద్దరు చెల్లెల్లుగా ఎవరిని సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Megastar Chiranjeevi Vishwambhara Movie Similar to Hitler With Socio Fantasy Touch Check Details

ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ చిరు.. ఈ సినిమాలో దొరబాబు పాత్రలో కనిపించబోతున్నారట. కథ అంతా భీమవరం నేపథ్యంలో సాగుతుందట. ఇక త్రిష కృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 10వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X