ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే పనిలో మెగాస్టార్! బాస్ మాములోడు కాదుగా..
మెగాస్టార్ చిరంజీవి వరుస హిట్లతో టాలీవుడ్ లో ఇంకా సత్తా చాటుతున్నారు. ఆరు పదుల వయస్సు దాటినా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా స్టోరీ, యాక్షన్, డాన్స్ ల వంటి విషయంలో ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. చివరిగా 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుతున్నారు. వింటేజ్ పెర్ఫామెన్స్ తోనూ ఆడియెన్స్, ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు.
చివరిగా 'భోళా శంకర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఆశించిన మేర ఫలితానివ్వలేదు. కానీ అంతంతకు మించి అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. అందుకు కాస్తా రూటు మార్చి సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ పూర్తిగా యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ దర్శకులతో ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'బింబిసార' దర్శకుడు వశిష్ఠతో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ సంక్రాంతికే రావాల్సి ఉండింది. కానీ కుదరలేదు. త్వరలోనే ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ తో బిగ్ స్క్రీన్ ను షేక్ చేయబోతున్నారు.
అలాగే నెక్ట్స్ యంగ్ డైరెక్టర్, 'దసరా'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలతోనూ చిరంజీవి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను కన్ఫమ్ చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీతో బాస్ తాండవం చూపిస్తానని ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ కు ప్రామీస్ కూడా చేశారు. మరోవైపు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనూ చిరు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. రీసెంట్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో అనిల్ మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ బాస్ తో ఎలాంటి ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తారోననేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా... చిరు మరోసారి మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో 'వాల్తేరు వీరయ్య' పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తదుపరి ఎలా ఎంటర్ టైన్ చేస్తారనేది మరింత ఆసక్తికరంగా మారింది.
ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్లను లైన్ లో పెట్టిన చిరంజీవి మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. సోషల్ మెసేజ్, మంచి కథనంతో డీసెంట్ హిట్ అందుకుంటూ.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరితో మూవీ చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో వెంకీ అట్లూరి మాటలు ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ తో సినిమా అంటే సాలిడ్ స్క్రిప్ట్ ఉండాలని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా బలమైన కథతో ప్రాజెక్ట్ కు ప్రారంభించాలని వెంకీ తలిచారంట.
అందుకు ఏడాది సమయం పడుతుందని, ఆ తర్వాత బాస్ తో సినిమా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారంట. ఈ విషయాన్ని యంగ్ ప్రొడ్యసూర్ నాగవంశీ చెప్పడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. సామాజిక అంశాలతో వెంకీ అట్లూరి చక్కటి సినిమాలను తెరక్కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తో ఎలాంటి సినిమా చేస్తారనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది


Click it and Unblock the Notifications











