చిరు కోరిక ‘మగధీర’ రికార్డ్ గా మిగిలిపోవాలన్నదే...
మెగాస్టార్ ఇక పూర్తిగా మేకప్ కి దూరమైపోయినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. రాజకీయ ఇతివృత్తంతో చిరు ఓ సినిమా చేస్తారనే వార్తలొచ్చినా, చిరంజీవిని మళ్ళీ నటింపజెయ్యాలని వివి వినాయక్, రాఘవేంద్రరావు, పరుచూరి వెంకటేశ్వరావు లాంటి పలువురు పెద్ద దర్శకులు ప్రయత్నించినా, ఆన్ స్ర్కీన్ మెగా మెస్మరిజం చూడాలనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తూ వున్నా..పద్మభూషణుడు మాత్రం ప్రజారాజ్యం అధ్యక్షుడిగానే వుండిపోతానంటున్నారు. ఇక కెమరా ముందుకు వచ్చే ఆసక్తి ఏమాత్రం లేనట్టు గా వ్యవహరిస్తున్నాడు.
ఇంతకీ ఆయన నిర్ణయం వెనక కారణాలేమిటా అని ఆరా తీస్తే తనయుడు రామ్ చరణ్ మెగా బ్లాక్ బస్టర్ 'మగధీర" లో గెస్ట్ రోల్ చేసిన చిరు తన చివరి సినిమా అనే క్రెడిట్ 'మగదీర"కే ఉండిపోవాలనీ, తన చివరి సినిమా గా 'మగధీర" చిత్రమే రికార్డుల్లో నిలిచిపోవాలనీ భావిస్తున్నరట. అయితే 'మగధీర" ఎలాగూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే చిత్రమే కనుకతన నట పయనంలో 150వ చిత్రం చేసి మెగాస్టార్ మరోసారి రికార్డుల చరిత్రని తిరగరాస్తే బావుంటుందన్నది ఆయన అశేషాభిమానుల కోరిక. మరి దీనికి మీరేమంటారు.


Click it and Unblock the Notifications











