మరోసారి కలిసి నటించబోతున్న చిరంజీవి, రామ్ చరణ్.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో..
మెగా స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య సిద్దమవుతున్న విషయం తెలిసిందే. కేవలం గెస్ట్ రోల్స్ వరకే పరిమితమైన ఈ కాంబో ఇప్పుడు ఏకంగా మల్టీస్టారర్ సినిమాల వరకు వచ్చేశారు. ఇక రెండవసారి కూడా ఈ అగ్ర హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవ్వవనున్నట్లు తెలుస్తోంది.

ఆచార్యపై భారీ అంచనాలు
ఒక హీరో సినిమాలో మరొక హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానుల్లో జోష్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఫస్ట్ అయితే బజ్ ఈజీగా పెరుగుతుంది. ఆచార్యపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

సిద్దా పాత్రలో రామ్ చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా సమ్మర్ కానుకగా మే 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పనులన్ని కూడా తుదిదశకు చేరుకున్నాయి. ఇక సినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ కాగా సిద్దా అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

శంకర్ దర్శకత్వంలో
అలాగే మరొక సినిమాలో కూడా ఈ మెగా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల లైకా ప్రొడక్షన్ వివాదం కారణంగా సినిమా ఆలస్యంగా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత ఆలస్యం అయినా కూడా శంకర్ మాత్రం రామ్ చరణ్ ను వధులుకోవాలని అనుకోవడం లేదట.

అసలు కథ..ఎమిటంటే?
ఇక సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ ఆఫీసర్ నుంచి ఒక యువకుడు సీఎంగా ఎలా మారాడు అనేది సినిమాలో చూపిస్తారట. ఇక మెగాస్టార్ చిరంజీవి కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఎప్పుడు ఇలాంటి. ప్రయోగం చేయలేదు. మరి ఇంతపెద్ద స్టార్స్ జూ వెండితెరపై ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











