ఆచార్య సినిమాలో బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్.. మరో ఆఫర్ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ హోదా వచ్చినప్పటి నుంచి కూడా టాలెంట్ ఉన్న వారికి ఎదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక స్టేజ్ వరకే పరిమితమైన చాలా మంది దర్శకులకు కొరియా గ్రాఫర్స్ కు అలాగే సంగీత దర్శకులకు తన సినిమా ద్వారా అవకాశం ఇచ్చి వారి స్థాయి పెరిగేలా చేశారు. ఇక నేటితరం నటీనటులకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. రీసేంట్ గా బిగ్ బాస్ 4కు చెందిన మరొక కంటెస్టెంట్ కు కూడా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్పీడ్ పెంచిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ సైరా అనంతరం మరింత స్పీడ్ పెంచేశారు. చాలా కాలం తరువాత ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. నేటితరం యంగ్ హీరోల కంటే వేగంగా షూటింగ్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు. నెక్స్ట్ ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ స్పెషల్ రోల్
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ గట్టిగానే ఉన్నట్లు టాక్ వస్తోంది. అయితే ఒక ఎమోషనల్ పాత్ర కోసం మెగాస్టార్ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఇద్దరికి ఆఫర్స్ ఇచ్చిన చిరు
ఇప్పటికే సోహెల్ కోసం అతని సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తానని మాట ఇచ్చిన మెగాస్టార్ దివికి కూడా మరో మంచి ఆఫర్ ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదళం రీమేక్ లో దివి గ్లామర్ గర్ల్ గా కనిపించనుంది. అలాగే మరొక టాలెంటెడ్ కంటెస్టెంట్ కు కూడా ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video

మెగాస్టార్ సినిమాలో మెహబూబ్
ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు. డ్యాన్స్ స్కిల్స్ తో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకొని బిగ్ బాస్ 4కు వెళ్లిన మెహబూబ్ దిల్ సే. బిగ్ బాస్ ఫైనల్ లోనే మెగాస్టార్ ను ఎట్రాక్ట్ చేసిన మెహబూబ్ 10లక్షల చెక్కును కూడా అందుకున్నాడు. ఇక ఆచార్య సినిమాలో ఒక చిన్న ఎమోషనల్ పాత్రకు అతనైతే కరెక్ట్ గా సెట్టవుతాడాని మెగాస్టార్, కొరటాలకు సజెస్ట్ చేశారట. మరి ఆ పాత్ర మెహబూబ్ కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











