జూ. ఎన్టీఆర్ దర్శకుడుతో మహేష్ బాబు చిత్రం కన్ఫర్మ్
గాలివార్త నిజమైంది. మెహర్ రమేష్..మహేష్ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ తో 'కంత్రి' రూపొందించి ప్రస్తుతం 'శక్తి' చిత్రం డైరక్ట్ చేస్తున్న మెహర్ రమేష్ ..తాజాగా మహేష్ బాబుకి ఓ కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. మే 2011 నుంచీ ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు..దూకుడు చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన ఖలేజా వర్కవుట్ కాకపోవటంతో కంటిన్యూగా సినిమాలు చేయాలని నిర్ణయానికి వచ్చి ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ తో చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ లోగా శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో ఢమురుకం అనే టైటిల్ లో నాగార్జున హీరోగా సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











