మెగాస్టార్ ఆఫర్ ఇచ్చాడని.. ఆ దర్శకుడు మూడేళ్ల నుంచి కష్టపడుతున్నాడట!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన 65వ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజున మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తారని అంతకుముందు వార్తలు బాగానే వచ్చాయి. కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో మెగాస్టార్ ఆచార్య తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఆచార్య సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ మెగాస్టార్ ఇద్దరు దర్శకులను అయితే లైన్ లో పెట్టాడు జై లవకుశ దర్శకుడు బాబీతో పాటు శక్తి డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. దాదాపు బాబీ స్క్రిప్ట్ అయితే పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ కథ మెయిన్ పాయింట్ మెగాస్టార్ కి బాగా నచ్చిందట. ఇక మెహర్ రమేష్ అయితే మూడేళ్ళ నుంచి మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

కోలీవుడ్ లో నటించిన అజిత్ వేదాళం కథనే మళ్ళీ కొత్తగా చూపించాలని మెహర్ రమేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. కథ అయితే రేడి అయ్యిందట. కేవలం కొన్ని మేజర్ చెంజెస్ అవసరమని చెప్పడంతో మళ్ళీ శక్తి దర్శకుడు కష్టపడుతున్నట్లు టాక్. మరి ఫైనల్ గా మెహర్ రమేష్ మెగాస్టార్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. ఇక సుజిత్ తో మెగాస్టార్ మలయాళం సినిమా లూసిఫర్ ని రీమేక్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ దర్శకుడు కథను సంతృప్తిపరిచే విధంగా ప్లాన్ చేసుకోలేదని రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











