twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెహర్ రమేష్ నెక్ట్స్ చిత్రం ఖరారు..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: వెంకటేష్‌ హీరో గా మెహర్ రమేష్ రూపొందించిన 'షాడో' చిత్రం ఈ నెల 26న (రేపు) ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపధ్యంలో మెహర్ రమేష్ తదుపరి ఏ చిత్రం చేస్తున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ విషయమై మెహర్ రమేష్ మాట్లాడుతూ...

    మళ్ల విజయప్రసాద్‌ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నాను. దానికి సంబంధించిన వివరాలు తరువాత చెబుతాను అన్నారు. మళ్ల విజయ ప్రసాద్ గతంలో అల్లరి నరేష్ తో సీమ టపాకాయ్, సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, నితిన్ తో సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలు నిర్మించారు.

    ఇక ఈ చిత్రం రవితేజతో ఉండబోతోందని తెలుస్తోంది. పవర్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. 'కంత్రి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడీయన. 'బిల్లా', 'శక్తి' చిత్రాలు ఆయన్నించి వచ్చినవే. తాజాగా వెంకటేష్‌ హీరోగా 'షాడో' చిత్రాన్ని తెరకెక్కించారు. షాడో చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గత చిత్రాలు ఆయన్ని బాగా నిరాసపరచటంతో ఈ చిత్రంపై ఆయన చాలా అంచనాలు పెట్టుకున్నారు.

    షాడో గురించి చెప్తూు...''రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడి మనసులోకి వేరే ఆలోచన రాకూడదు. అందుకు కథ, కథనాల్లో బలం ఉండాలి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను కష్టపడుతుంటాను. కథతోపాటు ప్రయాణం చేస్తూనే తెరపై నా శైలిని చూపించే ప్రయత్నం చేస్తాను'' అన్నారు మెహర్‌ రమేష్‌.

    'షాడో' నేపథ్యమేమిటంటే... కుటుంబ బంధాలు, వినోదం, పోరాటం... ఇలా అన్ని అంశాలూ మేళవించిన కథ ఇది. వేసవి సమయానికి తగిన చిత్రమిది. ఎందుకంటే అన్ని వయసులవాళ్లూ వినోదం కోసం సినిమాల వైపే మొగ్గు చూపుతారు. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాం. కథ మాఫియా నేపథ్యంలో సాగినా... యాక్షన్‌ సన్నివేశాలు భారీగా ఉన్నా... అవన్నీ చిన్న పిల్లల్ని సైతం ఆకట్టుకొనేలా ఉంటాయి. వెంకటేష్‌ తెరపై మూడు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన శైలిలో భిన్నమైన భావోద్వేగాలు పలికించారు అన్నారు.

    English summary
    Wellfare Creations achieved a hattrick by producing super hit films like 'Siddhu From Srikakulam', 'Sitaramula Kalyanam Lankalo' and 'Seema Tapakai' in the past and achieved a huge success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X