పెళ్లికి సిద్ధమైన ‘F2’ హీరోయిన్: ఏకంగా ఆ పార్టీ యువనేతతోనే.. మాజీ సీఎం ఇంట్లోకి టాలీవుడ్ బ్యూటీ

గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో చాలా మంది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక, ఈ ఏడాది కూడా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడదే జాబితాలోకి టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా చేరబోతుంది. కొద్ది రోజులుగా ఓ యువ రాజకీయ నేతతో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు.. తాజాగా అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అంతేకాదు, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది. దానికి సంబంధించిన వివరాలు మీ అందరి కోసం!

కృష్ణ గాడి ప్రేమ కోసం ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్

కృష్ణ గాడి ప్రేమ కోసం ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ ఫిర్జాదా. మొదటి సినిమాలోనే క్యూట్‌నెస్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. దీంతో ఆమెకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారనే చెప్పాలి.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ... అన్ని భాషల్లో

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ... అన్ని భాషల్లో

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' తర్వాత ఏకంగా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది మెహ్రీన్. అక్కడ ఓ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ తెలుగులో 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'కేరాఫ్ సూర్య', 'జవాన్', 'పంతం', 'కవచం' సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అదే సమయంలో తమిళం, పంజాబీ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. దీంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఆ సినిమాతో పుల్‌స్టాప్.. కెరీర్ మారిందిగా

ఆ సినిమాతో పుల్‌స్టాప్.. కెరీర్ మారిందిగా

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నాతో కలిసి మెహరీన్ చేసిన నటన ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'హనీ ఈజ్ ద బెస్ట్' అనే ప్రత్యేకమైన మేనరిజం ఆమెకు ఎన్నో ఆఫర్లను తెచ్చింది.

రాజకీయ యవనేతతో మెహ్రీన్ లవ్ ట్రాక్

రాజకీయ యవనేతతో మెహ్రీన్ లవ్ ట్రాక్

తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న మెహ్రీన్.. చాలా కాలంగా సీక్రెట్‌గా ప్రేమాయణం కూడా సాగిస్తోంది. అతడు ఎవరంటే.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయ్. అవును.. ఈ కుర్ర నేతతోనే మెహ్రీన్ ప్రేమలో ఉంది.

నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ

నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ

చాలా రోజులుగా భవ్య బిష్నోయ్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా.. అతడితో ఏడడుగులు వేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే తాజాగా అతడితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది.

Recommended Video

F3 Movie Launched With Pooja Ceremony
మాజీ సీఎం ఇంట్లోకి మెహ్రీన్ అడుగులు

మాజీ సీఎం ఇంట్లోకి మెహ్రీన్ అడుగులు

తాజాగా నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్ ఫిర్జాదా.. భవ్య బిష్నోయ్ త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ముహూర్తాలు లేని కారణంగా వీళ్ల వివాహం వచ్చే వేసవిలో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన నాయకులు కూడా హాజరవుతారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X