Just In
Don't Miss!
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రావాల్సిందేనని పట్టుబట్టాడట.. హీరోయిన్‌ను ఇబ్బందిపెట్టిన హీరో తండ్రి
ఓ సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. సరైన రీతిలో ప్రమోట్ చేసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలనేవీ చిత్రయూనిట్ ఆలోచనలకు తగ్గట్గుగా ఉంటాయి. ఈ ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్లు ఉంటే.. బాగుంటుందని అందరూ అనుకుంటారు. అయితే హీరో, హీరోయిన్స్ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదైనా సమస్య వస్తే కూడా పట్టుబట్ట కూడదు. కానీ అలా చేయడంతో మెహ్రీన్ చాలా ఇబ్బంది పడిందట. ఈ విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

భారీ అంచనాలతో అశ్వథ్థామ
ఛలో సినిమా ఐరా క్రియేషన్స్‌ను స్థాపించిన నాగశౌర్య, తల్లిదండ్రులకు (ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్) నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. మొదటి సినిమా భారీ హిట్ కొట్టింది. రెండో సినిమా నర్తనశాల బెడిసికొట్టింది. మూడో సినిమా అశ్వథ్థామ భారీ అంచనాలతో బరిలోకి దిగింది.

ఆశించినంతగా ఆకట్టుకోలేక..
అయితే కథకథనాలు ఆకట్టుకునేలా ఉన్నా.. వసూళ్లు మాత్రం ఆశించినంత రేంజ్‌లో రాలేదు. దీంతో ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. అయితే నిర్మాతలు కూడా వారే కావడంతో అంత కలెక్ట్ చేసింది ఇంత కలెక్ట్ చేసిందంటూ పోస్టర్స్ మాత్రం వదిలారు. కానీ వాస్తవంగా అంత మొత్తంలో రాబట్టలేదని టాక్.

కథను కాపీ..
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాను తానే రాశానని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. టైటిల్స్‌లో కూడా నాగశౌర్య కథ అందించాడనే ఉంటుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. ఈ కథ వేరే ఓ రచయితదట. తను చెప్పిన కథనే కాపీ కొట్టి అశ్వథ్థామ అని తీశాడని ఫిర్యాదు చేస్తే.. డబ్బుతో వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.


మెహ్రీన్‌ను ఇబ్బంది పెట్టిన నాగశౌర్య తండ్రి..
అశ్వథ్థామ ప్రమోషన్స్‌లో ఓ కార్యక్రమానికి మెహరీన్ హాజరు కావాల్సి ఉందట... అలర్జీ సోకడంతో తాను సదరు ప్రోగ్రామ్‌కు హాజరు కాలేనని శంకర్ ప్రసాద్‌కు చెప్పిందట. అయితే శంకర్ ప్రసాద్ వినిపించుకోకుండా.. ప్రోగ్రామ్‌కు హాజరు కావాల్సిందేనని పట్టుబట్టాడట. రాకపోతే హోటల్ బిల్స్ కట్టనని బెదిరించాడట. ఆయన ప్రవర్తన నచ్చకపోవడంతో చెప్ప పెట్టకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందట. దాంతో హోటల్ యాజమాన్యం శంకర్ ప్రసాద్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో శంకర్ ప్రసాద్ బిల్లు కట్టక తప్పలేదట. అయితే ఈ వార్తలపై నాగశౌర్య,ఐరా క్రియేషన్స్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.