twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య సినిమాలో విలన్‌గా మరో ఫ్యామిలీ హీరో.. భయంకరమైన గెటప్‌తో సీనియర్ నటుడు

    By Manoj
    |

    టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వాటిలో బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి. వీళ్లిద్దరి కలయికలో గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి విజయవంతమైన చిత్రాలు రావడమే దీనికి కారణం. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరీర్‌లో మైలురాయిలుగా పేరొందాయి. ముఖ్యంగా 'సింహా' సినిమాకు ముందు ఈ నందమూరి హీరో చేసిన సినిమాలలో చాలా వరకు నెగెటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నవే. బాలయ్యకు పీక్ స్టేజ్ నడుస్తున్న సమయంలో వచ్చిన ఈ చిత్రం.. ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. అలాగే, 'లెజెండ్' కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ జంట మరోసారి జతకట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

    రూల్ చేసే వాడిగా వస్తున్న బాలయ్య

    రూల్ చేసే వాడిగా వస్తున్న బాలయ్య

    నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్' అనే సినిమా చేస్తున్నాడు. సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్ రవికుమార్ తెరకెక్కించారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ‘జై సింహా' వంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న ‘రూలర్'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలయ్య రెండు విభిన్న గెటప్‌లతో కనిపిస్తున్నాడు.

    అన్నింటికీ మంచి స్పందనే

    అన్నింటికీ మంచి స్పందనే

    బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘రూలర్'కు సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే విడుదలైన వీటికి యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ఎంతో స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. ఇందుకోసం ఆయన దాదాపు 18 కేజీల వరకు తగ్గాడని ప్రచారం జరుగుతోంది.

    ఆ ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేశాడు

    ఆ ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేశాడు

    ‘రూలర్' విడుదల కాకముందే నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య ‘నువ్వు చెబితే అది మాటే.. అదే నేనంటే శాసనం' అంటూ ఓ చెప్పే డైలాగ్‌తో సినిమా ప్రారంభం అయింది. ఈ ఒక్క డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

    Recommended Video

    Nandamuribalakrishna & Boyapati Srinu New Movie Launch
    ఆయనకు అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు

    ఆయనకు అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు

    గతంలో బోయపాటి శ్రీను.. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబుకు ‘లెజెండ్' సినిమా ద్వారా అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలో సరైన హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న జగ్గూ భాయ్‌ కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పింది. అంతేకాదు, ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టు అయిపోడానికి కారణం కూడా ఈ సినిమానే అని అందరికీ తెలిసిందే.

     మరో ఫ్యామిలీ హీరోను విలన్ చేస్తున్నాడు

    మరో ఫ్యామిలీ హీరోను విలన్ చేస్తున్నాడు

    ఇక, కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బాలయ్య మూవీలోనూ మరో సీనియర్ హీరోను విలన్‌గా చూపించబోతున్నాడట బోయపాటి శ్రీను. కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇందులో ఓ భయంకరమైన గెటప్‌తో కనిపించబోతున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

    అక్కినేని హీరోతో ఢీ కొట్టాడు

    అక్కినేని హీరోతో ఢీ కొట్టాడు

    శ్రీకాంత్‌కు నెగెటివ్ పాత్రలు చేయడం కొత్త కాదు. వాస్తవానికి ఆయన కెరీర్ విలన్‌గానే ప్రారంభం అయింది. తొలినాళ్లలో శ్రీకాంత్ ఎన్నో సినిమాల్లో ఆ ఛాయలున్న పాత్రలు చేశాడు. ఇక, ఈ మధ్య కూడా అక్కినేని నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం' అనే సినిమాలోనూ ప్రతి నాయకుడి పాత్రను పోషించాడు. అయితే, ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు.

    English summary
    Director Boyapati Srinu will be directing Nandamuri Balakrishna in his next movie. There are more expectations from the fans on the combination of Boyapati Srinu and Balakrishna because of previous hit movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X