ఒకే వేదికపైకి చిరంజీవి, రాంచరణ్, బన్నీ.. త్వరలోనే ఈ అపురూప దృశ్యం!
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రాకతో మెగా ఫ్యామిలీ నుంచి మరొక హీరో వచ్చినట్లైంది. కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం పేరు విజేత. ఆ పేరు వినగానే మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ విజేత గుర్తుకు వస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ దేవ్ కూల్ లుక్ తో అలరించాడు. తాజగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

విజేత ఆడియో వేడుక
ఈ చిత్ర ఆడియో వేడుకకు ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 24 న ఆడియో వేడుక నిర్వహించబోతున్నారు. డెబ్యూ దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్
విజేత చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్ననేపథ్యంలో కళ్యాణ్ దేవ్ నటన పరంగా ఎలా ఆకట్టుకుంటాడనే ఆసక్తి నెలకొని ఉంది.

ఒకే వేదికపైకి ఆ ముగ్గురు
విజేత ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, రాంచరణ్, బన్నీ అతిధులు గా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ చిత్రానికి వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించాలని భావిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్
దాదాపుగా విజేత చిత్ర షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications











