ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్ హీరోలుగా,ఛార్మీ హీరోయిన్‌గా తయారవుతున్నకామెడీ 'మైఖేల్ మదన కామరాజు'.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పుర్తి చేసుకుని 18న ప్రేక్షకుల ముందుకు రావటానికి ముస్తాబవుతోంది.'అందరూ దొంగలే','భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'చిత్రాలతో నాన్ స్టాప్ గా నవ్వించిన నిధి ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందించారు. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ సినిమా ఛార్మి పాత్ర చుట్టూ తిరుగుతుంది.ఆమెను ప్రేమలో పడేయటానికి హీరోలు ముగ్గురూ పడే తిప్పలు తో సాగే సినిమా అంటున్నారు. నాగబాబు, బ్రహ్మానందం, ఆశా షైనీ, కోవై సరళ, కౌశ తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మన్నెం వెంకటరమణ, యోగేష్ పటేల్, రాజు పటేల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది . అలాగే ఈ చిత్రం హాలీవుడ్ హిట్ కామెడీ "సమ్ థింగ్ ఎబవుట్ మేరీ" ప్రేరణ అయ్యుండవచ్చునని కొందరు అంటున్నారు.దానిలో కూడా హీరోయిన్ ని ముగ్గురు హీరోలు రకరకాలుగా ప్రేమలో పడేయటానికి ట్రైల్స్ వేస్తుంటారు.ఆమె ఎవరికి యస్ చెబుతుందనేది అందులో సస్పెన్స్ ఎలిమెంటు.ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ నెల 18 దాకా ఆగాల్సిందే