twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునేషన్ పెంచేసిన ‘మిర్చి' డైరక్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇటీవల ప్రభాస్ తో 'మిర్చి' సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్‌తో చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ ..మిర్చి రిలీజ్ రోజే ప్రకటించారు. ఇక ఈ సినిమా నిమిత్తం కొరటాల శివకు రెండు కోట్ల వరకూ రెమ్యునేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    'మిర్చి' చిత్రం తొలి చిత్రం కావటంతో అతనికి కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యునేషన్ క్రింద ముట్టిందని, అయితే 'మిర్చి' విడుదల అయ్యాక విపరీతమైన డిమాండ్ రావటంతో ఆయన తన రెమ్యునేషన్ పెంచాడని చెప్తున్నారు. అయితే కొరటాల శివ అడక్కుండానే బండ్ల గణేష్ తన రేటుని చెప్పాడని తెలుస్తోంది.

    త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానున్నది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

    English summary
    
 Kortala Siva who became star director after his debut film Mirchi with Prabhas became sensational hit is currently directing Ram Charan. The film is produced by Bandla Ganesh and buzz is he is getting Rs 2crs. For his debut film itself he got Rs 1cr. Insiders say Bandla Ganesh is giving record Rs 17crs to Cherry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X