»   »  హాట్ న్యూస్: బాలకృష్ణ సరసన మిస్ ఇండియా (ఫోటో)

హాట్ న్యూస్: బాలకృష్ణ సరసన మిస్ ఇండియా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. కానీ ... ఎరికా ఫెర్నాండెజ్‌ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాసాలు ఉన్నట్లు సమాచారం.

మిస్ ఇండియా అయిన ఎరికా ఫెర్నాండెజ్‌ ప్రస్తుతం తెలుగులో డేగ అనే చిత్రంలో చేస్తోంది. ఆ తర్వాత తెలుగులో చేసే చిత్రం ఇదే అవబోతోందని సమాచారం. అలాగే ఆమె హిందీలో నటించిన లవ్ ఈజ్ నాట్ మేథమెటిక్స్ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

ఇక బాలయ్య గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. 'కొందరు ఆశించడానికి పుడతారు..కొందరు శాసించడానికి పుడతారు' అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''సింహా'ను మించి ఈ సినిమా వుంటుంది. ఇంతమంది అభిమానుల్ని పొందటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక రాష్ట్ర రాజకీయాల్లో మరో శకం ఆరంభమైంది. సంస్కరణల విప్లవకారుడు ఎన్టీఆర్. నాన్నగారి స్ఫూర్తితో అభిమానులందరూ ప్రజాసేవకు పూనుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ 'సినిమా లాంఛనంగా ప్రారంభమైనా, అభిమానుల మధ్య ఓ షాట్ తీసుకోవాలనే బాలయ్య కోరిక మేరకు ఈ రోజు షూటింగ్‌ను ప్రారంభించాం. అభిమానుంలందరూ గర్వించేలా సినిమాను తీర్చిదిద్దుతా' అన్నారు.

English summary
Miss India 2012 Erica Fernandes has been zeroed in on opposite Simha actor in the yet-to-be-titled film. Though it's almost confirm, the makers want this to be kept under wraps. Erica is awaiting the release of her Hindi film Love is not Mathematics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu