బాలయ్య మాట వింటాడా?

మరో ప్రక్క బాలకృష్ణ రెండవ విడత ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, తన వంతు బాధ్యతగా డబ్బింగ్ పూర్తి చేసి తన భాధ్యతను నిర్వర్తించుకున్నారు. ఈ విషయం సెటిల్ చేయటానికి బాలయ్య బుధవారం తన సన్నిహితులతో సమావేశమయ్యారు. వారు ఎం.సెట్ మే 14న జరుగుతోందని, మద్రాసులోనూ 13న ఎన్నికలు జరుగుతుండటం వంటి కారణాలు వివరించారు. అందుకు తగినట్లుగా ఈ సినిమాను మే 14న విడుదల చేయాలని సూచించారని తెలుస్తోంది. వారంతా మైనస్ లు ప్లస్ లు వివరించాని బాలయ్య కన్వీన్స్ కాలేదని తెలుస్తోంది.
ఏదిఏమైనా ముందుగా అనుకున్న టైమ్ లోనే సినిమాను రిలీజ్ చేస్తామని, ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని బాలయ్య సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇంతకీ మిత్రుడు మే డే రోజున రిలీజవుతుందో లేక మే 14 న రిలీజ్ అవుతుందో చూడాలి. అదే రోజున రవితేజ, ఇలియానా కాంబినేషన్ కిక్ రిలీజ్ ఉంది.


Click it and Unblock the Notifications











