ఆ డైరెక్టర్‌కు బాగా కలిసొచ్చిన గ్యాప్: చిరంజీవి మూవీ స్టోరీని మార్చేస్తున్నాడట
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్' మూవీ రీమేక్ కూడా ఉంది. మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి 'లూసీఫర్' మూవీని రీమేక్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అప్పుడు దర్శకుడిగా సుజిత్‌ను తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఊహించని విధంగా అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను తీసుకున్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ స్క్రిప్టులో చాలా రకాల మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా హీరో పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలను మరిన్ని యాడ్ చేశారు. ఇక, ఇప్పడు కరోనా వల్ల దొరికిన గ్యాప్‌ను ఉపయోగించుకుంటోన్న మోహన్ రాజా.. కథలో మరిన్ని మార్పులు చేస్తున్నారని తాజాగా తెలుస్తోంది.

వాస్తవానికి 'లూసీఫర్' మూవీ రీమేక్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల షూటింగులు ఆగిపోవడంతో దీన్ని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మోహన్ రాజా.. స్క్రిప్టును రీరైట్ చేస్తున్నారని అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మిగిలిన నటీనటులపై అధికారిక ప్రకటనలు రాలేదు.


Click it and Unblock the Notifications











