‘మొగుడు’రాక మరింత ఆలస్యం?

గోపీచంద్, తాప్సీ ప్రధాన పాత్రధారులు కాగా... శ్రద్ధాదాస్ మరో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెడలో మూడుముళ్లు వేసిన ప్రతి ఒక్కడూ మొగుడు కాలేడు. తనని నమ్మి వచ్చిన మగువ మనసు గెలుచుకున్నవాడే నిజమైన మొగుడు.. మగాడు. ఈ విషయాన్నే కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కించారట. అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు వెరసి కృష్ణ వంశీ సినిమా. 'మురారి"గా మురిపించినా, 'చందమామ"లోని చల్లని వెన్నెలను ధియేటర్లలో కురిపించినా అది కృష్ణవంశీకే చెల్లింది. మరి గోపీచంద్ ను మొగుడి ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా : శ్రీకాంత్, సమర్పణ : బేబీ భవ్య, నిర్మాణ : లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











