సునీల్ పై కోపంతోనే మోహన్ బాబు
మోహన్ బాబు,సునీల్ కాంబినేషన్ లో రాయుడుగారికి కోపమొచ్చింది అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ వార్త వచ్చిన రెండు రోజులుకు అఫీషియల్ గా మోహన్ బాబు తనే హీరోగా,ఐదుగురు హీరోయిన్స్ తో ఓ చిత్రం ప్రారంభం కానుందంటూ ప్రకటించారు.ఇ నివాస్ దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కోన వెంకట్,బివియస్ రవి,గోపీ మోహన్ కలిసి రచన చేసినట్లు చెప్పారు.అలాగే ఆ చిత్రాన్నితన సొంత బ్యానర్ పైనే చేయనన్నట్లు తెలిపారు.ఎందుకిలా హఠాత్తుగా సునీల్ ని సీన్ నుంచి తప్పించారనే సందేహం చాలామంది సినీ ప్రాణులకు కలిగింది.
అయితే దీనికి కారణం మోహన్ బాబే నని తెలుస్తోంది. తాను హీరోగా చేద్దామని ఫిక్సైయిన సినిమాలో సునీల్ ని హైలెట్ చేస్తూ వార్తలు రావటం మోహన్ బాబుని ఇరిటేట్ చేసిందంటున్నారు.దాంతో వెంటనే రంగంలోకి దిగి ఈ ప్రకటన చేసాండంటున్నారు.ఇక సునీల్ ని ఈ చిత్రంలో ఓ కీలకమైన క్యారెక్టర్ కి అనుకున్నారని,అతను ఓకే చేసాడని,మోహన్ బాబు కూతుళ్ళలో ఒకరని చేసుకునే పాత్ర అదని చెప్తున్నారు.అయితే సునీల్ ఇప్పుడు సీన్ లో ఉన్నాడా లేదా అన్నది మాత్ర సస్పెన్స్ గా ఉంది.ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ కోసం ప్రస్తుతం వేట జరుగుతోంది.ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ ని అడుగుతున్నారు.తాప్సీ అందులో ఒకతె అయ్యే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











