హాట్ స్టార్ తాప్సీ పై మోహన్ బాబు కంప్లైంట్
హాట్ స్టార్ తాప్సీ పై తాజాగా మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కంప్లైంట్ నమోదు అయిందని వినికిడి. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు..మోహన్ బాబుని చెప్తున్నారు. ఝుమ్మంది నాదం చిత్రంతో తామే పరిచయం చేసిన ఈ ముధ్దుగుమ్మ తమకే ట్విస్ట్ ఇచ్చిందని దాంతో ఆమెపై యాక్షన్ తీసుకోమంటూ నిర్మాతల మండిలికి వెళ్ళారని చెప్తున్నారు. అలాగే తమ బ్యానర్ లో మరో చిత్రం చేస్తానని కమిటైన ఆమె తమిళంలో ఆఫర్స్ వచ్చేసరికి నో చెప్పిందని అదే మంచు కుటుంబం ఆగ్రహానికి కారణమనేది వార్త.ఇక ఇప్పటికే తాప్సీ మంచు వారసులు మంచు మనోజ్ సరసన ఝుమ్మంది నాదం, మంచు విష్ణు సరసన వస్తాడు నా రాజు చిత్రాలు చేసింది. రెండు చిత్రాలు ఆమెను ఎక్సపోజ్ చేసి లాభం పొందాలనే యోచనతో చేయటంతో అవి భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతోనే ఆమె భయపడి మరో చిత్రం అంటే పరారయిందని అంటున్నారు. అంతేగాక మోహన్ బాబు చేస్తున్న ఫోన్స్ ఎత్తటం లేదని,కాల్స్ కు కూడా రెస్పాండ్ కావటం లేదని అదే కంప్లైంట్ ఇచ్చేందుకు దోహదం చేసిందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











