మోహన్ బాబు...రావణాసురుడు
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్సకత్వంలో మరో సారి మోహన్ బాబు నటించనున్నారు. రావణ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కి చెందిన స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తన డైలాగులతో అదరకొట్టే మోహన్ బాబు తొలిసారిగా రావణాసురుడుగా కనపించి అలరించనున్నారు. మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. అలాగే మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై రాయుడుగారికి కోపమొచ్చింది అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.
మోహన్‌బాబు హీరోగా శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇ.నివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారు.అయితే ఐదుగురు హీరోయిన్స్ నిజానికి సినిమాలో మోహన్ బాబు ప్రక్కన చేయటం లేదని, కథలో భాగంగా వారంతా మోహన్ బాబుకు కూతుళ్ళుగా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.హీరోయిన్స్ అంటే ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందన అలా చెప్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో వినపడుతోంది.దర్శకుడు ఇ.నివాస్ గతంలో హిందీలో 'శూల్' అనే చిత్రాన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications











