మోహన్ బాబుకి హ్యాండిచ్చింది...ఆయనసలే ఛండశాసనుడు..
తాప్సీని పెంచి పోషిస్తున్న మంచు కుంటుంబం ఆమెకి ఎదురు తిరగిందా? తాప్సీ బిజీ అయిపోయి తమని లెక్క చేయడం లేదని మండి పడుతోందా? అంటే అవుననే అంటున్నాయి గాసిప్ వర్గాలు. మంచు బ్రదర్స్ ఇద్దరితో సినిమాలు చేసిన తాప్సీ మోహన్ బాబు బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉందట. అందుకు ఆమో అగ్రిమెంట్ కూడా సైన్ చేసిందట. ఇంతలో తెలుగు, తమిళంలో బిజీ అయిపోవడంతో తాప్సీ ప్రస్తుతం మంచు కంచె నుంచి బయటపడేందుకు చూస్తోందట. మోహన్ బాబు సినిమాలో నటించడానికి కుదరదని చెప్పిందట. అసలే చండశాసనుడు కాబట్టి తాప్సీ పై నిర్మాతల మండలిలో కంప్లయింట్ ఇచ్చినట్టు భోగట్టా. ఇదే కనుక నిజమైతే మంచు ఫ్యామిలీతో రాసుకు పూసుకు తిరుగుతున్న తాప్సీకి ఏదో ఒకనాడు ఎదురవుతుందని సినీ వర్గాలు ఊహించిన పరిస్థితే ఎదురైందని అనుకోవచ్చ..
More from Filmibeat
మోహన్ బాబు తాప్సీ మంచు విష్ణువర్థన్ మంచు మనోజ్ ఝుమ్మంది నాదం mohan babu tapsi manchu vishnuvardhan manchu manoj jhummandi naadam


Click it and Unblock the Notifications











