రామ్ చరణ్ తో మోహన్ బాబు గొడవపడ్డాడంటూ...
రామ్ చరణ్ కీ, దాసరికి మధ్య జరిగుతున్న కోల్డ్ వార్ లో మోహన్ బాబు తల దూర్చి తన గురువు కి సహాయం చేసాడన్న రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ టీవీ ఛానెల్ ఈ విషయమై మోహన్ బాబు..రామ్ చరణ్ ని తిట్టాడంటూ స్కోరింగ్ ప్రసారం చేసింది.అయితే ఆ అత్యుత్సాహానికి మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న అడ్డు కట్ట వేసింది. ఆమె కలిపించుకుని వెంటనే ఆ టీవీ ఛానెల్ వారిని మందలించి, అటువంటి వివాదమేమీ జరగకుండా అలా వార్తలు ప్రసారం చేయటం అనైతికమని అంది. అంతేగాక మోహన్ బాబుకి చరణ్ కి మద్య మంచి రిలేషన్ ఉందంటూ చెప్పుకొచ్చింది.ఈ విషయమై తన తండ్రి చాలా కోపంగా ఉన్నారని,మరోసారి అటువంటి న్యూస్ లు ప్రసారం చెయ్యద్దని వార్నింగ్ తరహాలో చెప్పుకొచ్చింది. అస్సలు ఏమి జరిగిందో ఎవరికీ తెలియకపోయినా ఈ మ్యాటర్ మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











