హాట్ టాపిక్: చిరంజీవి పాటకు మోహన్ బాబు డాన్స్

By Srikanya

Mohan Babu To Dance For Chiranjeevi's Tune?
హైదరాబాద్: చిరంజీవి,మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్ రన్ అవుతున్న సంగతి తలిసిందే. వీరి మధ్య కానీ,వీరి కుటుంబాల మధ్య కానీ ఏ విధమైన ప్యాచ్ అప్ జరగలేదు. అయితే తాజాగా మోహన్ బాబు...చిరు సూపర్ సాంగ్ రీమిక్స్ కు డాన్స్ చేయటానికి అంగీకరించారని తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు యమలీల -2 (సీక్వెల్).

ఎస్వీ కృష్ణారెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్... "యమహో నీ యమా యమ అందం..." ని రీమిక్స్ చేయనున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఈ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు మళ్లీ థియోటర్స్ లో ఈ పాట రేంజిలో క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దానికితోడు మోహన్ బాబు స్టెప్స్ ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోమంటున్నారు.

1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సదా,నిషా కొఠారి ఎంపిక అయినట్లు సమాచారం. వీరిద్దరిపై ఓ పాటను ఈ వారంలో చిత్రీకరించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన యమధర్మరాజు గా కనిపించనున్నారు. హీరోగా కొత్త కుర్రాడిని ఎంపిక చేసారని వినికిడి.

ఇక చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందమే చేస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ స్క్రిప్టు వర్క్ లోనే ఎస్వీ బిజీగా ఉన్నారు. సీక్వెల్ గా ఈ చిత్రం బిజినెస్ పరంగానూ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ తరం యువత పల్స్ ని ఎంత మేరకు పట్టుకోగలుగుతాడనే విషయంపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుందనేది మాత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X