మంచు మనోజ్ రెండో వివాహం.. కోపంతో మోహన్ బాబు.. పెళ్లికి వెళ్లకుండా అక్కడే!

కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమదైన శైలీలో ఎంటర్టైన్ చేశారు. ఇక ఇటీవల ఎక్కువగా మంచు మనోజ్ పేరు వార్తల్లో నిలుస్తోంది. మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మొదట్లో కొన్ని విభిన్నమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాడు.

తర్వాత హీరోగా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు పొందలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆయన మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మార్చి 3న మనోజ్ వివాహం జరగనుంది. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది.

 అనేక చిత్రాలతో ఎంటర్టైన్..

అనేక చిత్రాలతో ఎంటర్టైన్..

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు సినిమాల్లో అలరించాడు. చాలా కాలం తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు.

మోహన్ బాబు స్థాయిలో..

మోహన్ బాబు స్థాయిలో..

మంచు మనోజ్ పెద్ద సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన మేనరిజం, స్టైల్, నటనతో ఆకట్టుకున్నాడు. దొంగ దొంగది, రాజు భాయ్, బిందాస్, వేదం సినిమాలతో హిట్ కొట్టిన మంచు మనోజ్.. పలు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. అయితే మంచు విష్ణు గానీ, మంచు మనోజ్ గానీ మోహన్ బాబు రేంజ్ లో గుర్తింపు, సక్సెస్ అందుకోలేకపోయారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ పర్సనల్ విషయాలపై అనేక రూమర్స్ ఇటీవల తెగ హల్ చల్ చేశాయి.

ఆమెతో పెళ్లి జరగనున్నట్లు..

ఆమెతో పెళ్లి జరగనున్నట్లు..

తన సినీ కెరీర్‌లో హీరోగా ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు మంచు మనోజ్. ఈ పరిస్థితుల్లోనే తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి.. 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2019లో భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. దీని తర్వాత కొంత కాలానికి దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో మనోజ్ పెళ్లి జరగబోతున్నట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి.

అనేక కారణాలు..

అనేక కారణాలు..

ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. మార్చి 3న మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి వివాహం జరగనుంది. నేటి నుంచే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇవాళ అంటే మార్చి 2న మెహందీ వేడుకను నిర్వహించారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. మౌనికతో మనోజ్ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రత్యర్థి పార్టీ నేత కావడంతో..

ప్రత్యర్థి పార్టీ నేత కావడంతో..

మంచు మనోజ్ లానే మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి. ఇప్పటికే తన మొదటి భర్త నుంచి మౌనిక విడాకులు తీసుకున్నారు. ఇక మౌనిక రెడ్డి ఫ్యామిలీ మొత్తం తెలుగు దేశం పార్టీలో ఉంది. మోహన్ బాబు కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్ పార్టీకి అనుకూలం అని తెలిసిందే. అందుకే ప్రత్యర్థి పార్టీ నేత కుమార్తె కావడంతో మౌనిక రెడ్డితో మనోజ్ పెళ్లి చేయడం మోహన్ బాబుకు ఇష్టం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మనోజ్ పెళ్లికి రాకుండా..

మనోజ్ పెళ్లికి రాకుండా..

అంతేకాకుండా మనోజ్ పెళ్లికి మోహన్ బాబు అసలు హాజరు కావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న కారణంగా మనోజ్ పై మోహన్ బాబు చాలా కోపంగా ఉన్నారని టాక్. మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని అంటున్నారు.

ఇవాళ మెహందీ వేడుక ఉన్న కూడా ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ రాలేదని భోగట్టా. కాబట్టి, మనోజ్ పెళ్లికి కూడా మోహన్ బాబు హాజరుకాకపోవచ్చని నడుస్తున్న టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X