»   » అదేం పాత్ర?... మంచు లక్ష్మికి మోహన్ బాబు చివాట్లు!

అదేం పాత్ర?... మంచు లక్ష్మికి మోహన్ బాబు చివాట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబుకు కోపం వస్తే ఎవరినైనా సరే కడిగేస్తాడు. ఇటీవల తన కూతరు మంచు లక్ష్మికి కూడా మోహన్ బాబు ఓ విషయంలో చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ లక్ష్మీ చేసిన తప్పేంటంటే 'గుంటూరు టాకీస్‌'లో గెస్ట్ రోల్‌లో నటించడమే. గెస్ట్ రోల్ చేయడంలో తప్పు లేదు కానీ... ఆమె ఎంచుకున్న పాత్ర మోహన్ బాబుకు అస్సలు నచ్చలేదు.

గతంలో 'చందమామ కథలు' మూవీ తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'గుంటూరు టాకీస్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఓ చిన్న పాత్ర కోసం లక్ష్మిని అడగటంతో కేవలం అతని కోసం గెస్ట్ రోల్ చేసింది. అది కూడా హీరో దగ్గర డబ్బులు కొట్టేసే సీన్‌లో నటించింది.

Mohan Babu fires on Manchu Lakshmi

అసలు గుంటూరు టాకీస్ సినిమా మోహన్ బాబు అస్సలు నచ్చలేదని సమాచారం. రష్మి అందాలు ఎరవేసి సినిమా ప్రమోషన్ నిర్వహించడంతో ఆయన దీన్ని బి గ్రేడ్ సినిమాగా తేల్చేసారట. అలాంటి సినిమాలో తన కూతురు మంచు లక్ష్మి డబ్బులు కొట్టేసే పాత్ర చేసిందని తెలిసి మోహన్ బాబుకు కోపం కట్టలు తెంచుకుందని అంటున్నారు.

దీంతో మంచు లక్ష్మిని పిలిచి సుతి మెత్తగా చివాట్లు పెట్టినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుపై నమ్మకంతోనే గుంటూరు టాకీస్ లో గెస్ట్ రోల్ చేసానని, ఇకపై ఇలాంటి బిగ్రేడ్ సినిమాల్లో నటించని తండ్రికి వివరణ ఇచ్చుకుందట మంచు లక్ష్మి.

English summary
Mohan Babu is fired on his loving daughter Manchu Lakshmi regarding her role in recently released movie “Guntur Talkies”, directed by Praveen Sattaru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu