టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో: మహేశ్ బాబుతో మోహన్ బాబు.. ఎందుకు కలుస్తున్నారో తెలిస్తే!

అద్భుతమైన యాక్టింగ్, ఆకట్టుకునే రూపంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ సత్తా చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కృష్ణ వారసత్వాన్ని కొనసాగించేందుకు హీరోగా పరిచయం అయిన అతడు.. ఆరంభం నుంచీ తనదైన సినిమాలతో అలరిస్తున్నాడు. దీంతో ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నాడు.

ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో సినిమా సినిమాకూ మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మహేశ్ బాబుతో మోహన్ బాబు కలబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

విజయాలతో హ్యాట్రిక్ నమోదు

విజయాలతో హ్యాట్రిక్ నమోదు

ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు చేసిన సినిమాలన్నీ హిట్లు అవడమే. కొరటాల శివతో చేసిన ‘భరత్ అనే నేను' నుంచి వరుసగా ‘మహర్షి', ‘సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే మహేశ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేశాడు.

సర్కారు వారి పాటలో మహేశ్

సర్కారు వారి పాటలో మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ 60 శాతం వరకూ పూర్తైపోయింది.

మూడోసారి ఆ డైరెక్టర్‌తో జోడీ

మూడోసారి ఆ డైరెక్టర్‌తో జోడీ

ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

అంతకంతకూ ఆలస్యంగానే

అంతకంతకూ ఆలస్యంగానే

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో అతడి షూటింగ్ ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. దీంతో ఇది మరింత లేట్ కాబోతుంది.

పనులు పూర్తి... నటుల కోసం

పనులు పూర్తి... నటుల కోసం


మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఈ మూవీ కోసం గురూజీ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడని ఎప్పుడో న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడట. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక మీద దృష్టి సారించారని తెలిసింది.

 మహేశ్‌తో మోహన్ బాబు జోడీ

మహేశ్‌తో మోహన్ బాబు జోడీ

మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే నటీనటుల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తీసుకుంటున్నారని తెలిసింది.

Recommended Video

Mahesh Babu Fans Played Key Role In Hero Movie Blockbuster | Filmibeat Telugu
ఎందుకు కలుస్తున్నారంటే!

ఎందుకు కలుస్తున్నారంటే!

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు.. మహేశ్ బాబు మేనమామగా నటించబోతున్నారని కూడా ఓ న్యూస్ లీకైంది. ఇది సినిమాలోనే ఎంతో ముఖ్యమైన పాత్ర అని సమాచారం. అందుకే ఇందులో నటించేందుకు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇక, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X